కేంద్రంలో చక్రం తిప్పనున్న కెసిఆర్ : ఎర్రబెల్లి

వరంగల్‌ : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ 16 స్థానాలు సాధించి తీరుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్, బిజెపిలు అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవని ఆయన తేల్చి చెప్పారు. ప్రాంతీయ పార్టీలు సూచించిన వ్యక్తే ప్రధాని అవుతారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో 16 స్థానాలు సాధిస్తే, పార్టీ అధినేత కెసిఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పగలరని ఆయన తెలిపారు. వరంగల్‌లో ఏప్రిల్‌ 2న జరిగే సిఎం బహిరంగ […]

వరంగల్‌ : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ 16 స్థానాలు సాధించి తీరుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్, బిజెపిలు అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవని ఆయన తేల్చి చెప్పారు. ప్రాంతీయ పార్టీలు సూచించిన వ్యక్తే ప్రధాని అవుతారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో 16 స్థానాలు సాధిస్తే, పార్టీ అధినేత కెసిఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పగలరని ఆయన తెలిపారు. వరంగల్‌లో ఏప్రిల్‌ 2న జరిగే సిఎం బహిరంగ సభా ఏర్పాట్లను మంత్రి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. బహిరంగ సభకు రెండు లక్షల మంది వచ్చేలా ఏర్పాట్లు చేస్తునట్లు ఆయన వెల్లడించారు. గతంలో ఇక్కడి సభలో పాల్గొన్న పివి నరసింహారావు ప్రధాని అయ్యారని ఆయన గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ  ఈ సెంటిమెంట్‌ కొనసాగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ విజయం కోసం టిఆర్ఎస్ కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలని ఆయన కోరారు.

Minister Errabelli Comments on Lok Sabha Elections

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: