పంజాబ్ జయకేతనం

  జైపూర్: ఐపిఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ శుభారంభం చేసింది. సోమవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ 14 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. క్రిస్ గేల్ తొలి మ్యాచ్‌లోనే విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న గేల్ 47 బంతుల్లోనే 4 భారీ సిక్స్‌లు, మరో 8 ఫోర్లతో 79 పరుగులు చేశాడు. […]

 

జైపూర్: ఐపిఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ శుభారంభం చేసింది. సోమవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ 14 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. క్రిస్ గేల్ తొలి మ్యాచ్‌లోనే విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు.

ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న గేల్ 47 బంతుల్లోనే 4 భారీ సిక్స్‌లు, మరో 8 ఫోర్లతో 79 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ 29 బంతుల్లో అజేయంగా 46 పరుగులు సాధించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 170 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. జోస్ బట్లర్ 43 బంతుల్లోనే 69 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. కీలక సమయంలో పంజాబ్ బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో జట్టును గెలిపించారు.

Rajastan vs Punjab: Panjab won by 14 runs

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: