సౌతాఫ్రికా క్లీన్‌స్వీప్

  మూడో టి20లోనూ లంక చిత్తు జోహెన్నస్‌బర్గ్: శ్రీలంకతో జరిగిన మూడో, చివరి ట్వంటీ20లో ఆతిథ్య సౌతాఫ్రికా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 45 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ మ్యాచ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ 3-0తో వైట్‌వాష్ చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసినా సౌతాఫ్రికా 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. డ్వైన్ ప్రెటోరియస్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో సౌతాఫ్రికాను ఆదుకున్నాడు. లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ప్రెటోరియస్ పరుగుల వరద […]

 

మూడో టి20లోనూ లంక చిత్తు
జోహెన్నస్‌బర్గ్: శ్రీలంకతో జరిగిన మూడో, చివరి ట్వంటీ20లో ఆతిథ్య సౌతాఫ్రికా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 45 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ మ్యాచ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ 3-0తో వైట్‌వాష్ చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసినా సౌతాఫ్రికా 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. డ్వైన్ ప్రెటోరియస్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో సౌతాఫ్రికాను ఆదుకున్నాడు. లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ప్రెటోరియస్ పరుగుల వరద పారించాడు. చెలరేగి ఆడిన ప్రెటోరియస్ ఏడు ఫోర్లు, మరో మూడు సిక్సర్లతో 42 బంతుల్లోనే అజేయంగా 77 పరుగులు చేశాడు. మరోవైపు ఓపెనర్ హెండ్రిక్స్ ఆరు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 66 పరుగులు సాధించాడు. చివర్లో కెప్టెన్ డుమినీ ఆకాశమే హద్దుగా లంక బౌలర్లపై విరుచుకు పడ్డాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన డుమినీ 14 బంతుల్లోనే మూడు సిక్స్‌లు, మరో రెండు ఫోర్లతో అజేయంగా 34 పరుగులు చేశాడు. దీంతో సౌతాఫ్రికా భారీ స్కోరును నమోదు చేసింది.

తర్వాత బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. లంక స్కోరు 11 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 110 పరుగులు ఉన్నప్పుడు వర్షం మొదలైంది. దీంతో ఆటను నిలిపి వేశారు. తర్వాత లంక లక్ష్యాన్ని 17 ఓవర్లలో 183గా నిర్ధారించారు. అయితే ఒత్తిడిలో ఆడిన శ్రీలంక 15.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం చవిచూసింది. చెలరేగి ఆడిన ఉడానా 4 భారీ సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. మరోవైపు ఓపెనర్ డిక్వెల్లా 7 ఫోర్లు, సిక్స్‌తో 38 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లంక జట్టులో ముగ్గురు మాత్రమే రెండంకెలా స్కోరును అందుకున్నారు. మిగతావారు విఫలం కావడంతో లంకకు హ్యాట్రిక్ ఓటమి తప్పలేదు. వరుస విజయాలతో దక్షిణాఫ్రికా సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.

SA vs Sri Lanka T20: South Africa won by 45 runs

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: