ఫెయిల్యూర్ మనకు బెస్ట్ టీచర్

సాయిధరమ్‌తేజ్ హీరోగా ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తున్న చిత్రం ‘చిత్రలహరి’. కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి ఈ సినిమాను ఏప్రిల్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలోని ‘గ్లాస్‌మేట్స్’ అనే పాటను ఖమ్మంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ “మా రెండో పాటను విడుదల చేశాం. టీజర్‌కు, […]

సాయిధరమ్‌తేజ్ హీరోగా ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తున్న చిత్రం ‘చిత్రలహరి’. కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి ఈ సినిమాను ఏప్రిల్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలోని ‘గ్లాస్‌మేట్స్’ అనే పాటను ఖమ్మంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ “మా రెండో పాటను విడుదల చేశాం. టీజర్‌కు, ఫస్ట్ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది.

సాయిధరమ్‌తేజ్ మంచి సక్సెస్‌ను కొట్టబోతున్నారు. ఏప్రిల్ 12న సినిమా విడుదల కానుంది”అని అన్నారు. దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ “అన్ని కమర్షియల్ అంశాలతో వినోదాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించాం. అందరికీ తప్పకుండా నచ్చుతుంది”అని తెలిపారు. హీరో సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ “మన జీవితంలో ఫెయిల్యూర్ మనకు బెస్ట్ టీచర్. పాఠాలతో పాటు ఫెయిల్యూర్స్ కూడా చాలా నేర్పిస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమిది”అని చెప్పారు. సునీల్ మాట్లాడుతూ “నా కెరీర్‌లో మరచిపోలేని చిత్రం ‘చిత్రలహరి’. ఈ చిత్రం నాకు మంచి పేరును తీసుకువస్తుంది”అని పేర్కొన్నారు.

Glassmates song release from Chitralahari

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: