రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో…

స్టార్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాణంలో వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న యంగ్ బ్యూటీ హెబ్బాపటేల్. ఈ సినిమాతో టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షించి హీరోయిన్‌గా మంచి అవకాశాలను దక్కించుకుంది. అయితే వరుస ఫ్లాపులతో ఈ అమ్మడికి ప్రస్తుతం అవకాశాలు తగ్గాయి. దీంతో వరుసగా బోల్డ్ సినిమాలు అంగీకరిస్తూ రెచ్చిపోతోంది ఈ బ్యూటీ. తన గత చిత్రం ‘24 కిస్సెస్’లో హెబ్బా బోల్డ్ యాక్టింగ్‌తో అలరించినప్పటికీ ఆ సినిమా విజయం సాధించలేకపోయింది. అయితే […]

స్టార్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాణంలో వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న యంగ్ బ్యూటీ హెబ్బాపటేల్. ఈ సినిమాతో టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షించి హీరోయిన్‌గా మంచి అవకాశాలను దక్కించుకుంది. అయితే వరుస ఫ్లాపులతో ఈ అమ్మడికి ప్రస్తుతం అవకాశాలు తగ్గాయి.

దీంతో వరుసగా బోల్డ్ సినిమాలు అంగీకరిస్తూ రెచ్చిపోతోంది ఈ బ్యూటీ. తన గత చిత్రం ‘24 కిస్సెస్’లో హెబ్బా బోల్డ్ యాక్టింగ్‌తో అలరించినప్పటికీ ఆ సినిమా విజయం సాధించలేకపోయింది. అయితే తాజాగా హెబ్బా పటేల్ మరో బోల్డ్ మూవీలో నటించేందుకు ఓకే చెప్పింది. సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో ప్రిన్స్ హీరోగా తెరకెక్కే ‘రాడికల్’ చిత్రంలో హెబ్బా బోల్డ్ క్యారెక్టర్‌లో నటించనుంది. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ హాట్ సీన్స్‌లో అదరగొడుతుందని తెలిసింది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.

Hebah Patel Play bold character in Radical movie

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: