ఏసిబికి చిక్కిన వీఆర్‌ఎ

  మనతెలంగాణ/పెద్దకొత్తపల్లి: 5వేల రూపాయలు ఇస్తేనే కొత్త పాసుపుస్తకాలు ఇస్తానని వీఆర్‌ఎ శ్రీధర్, మారేడుదిన్నె గ్రామానికి చెందిన రైతు సొప్పరి నర్సింహ్మ నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసిబి డిఎస్పి శ్రీకృష్ణగౌడు రెడ్‌హ్యండెండ్‌గా పట్టుకొని తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. డిఎస్పి తెలిపిన వివరాల ప్రకారం… మారేడుదిన్నె గ్రామానికి చెందిన నర్సింహ్మ తన కొత్తపాసుపుస్తకం ఇవ్వాలని వీఆర్‌ఎ శ్రీధర్‌ను కోరగా 5వేల రూపాయలు ఇవ్వాలని చెప్పడటంతో ఈనెల 18వ తేదీన రైతు నర్సింహ్మ మహబూబ్‌నగర్‌కు వెళ్లి ఏసిబి అధికారులను కలిశాడు. ఏసిబి అధికారులు […]

 

మనతెలంగాణ/పెద్దకొత్తపల్లి: 5వేల రూపాయలు ఇస్తేనే కొత్త పాసుపుస్తకాలు ఇస్తానని వీఆర్‌ఎ శ్రీధర్, మారేడుదిన్నె గ్రామానికి చెందిన రైతు సొప్పరి నర్సింహ్మ నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసిబి డిఎస్పి శ్రీకృష్ణగౌడు రెడ్‌హ్యండెండ్‌గా పట్టుకొని తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. డిఎస్పి తెలిపిన వివరాల ప్రకారం… మారేడుదిన్నె గ్రామానికి చెందిన నర్సింహ్మ తన కొత్తపాసుపుస్తకం ఇవ్వాలని వీఆర్‌ఎ శ్రీధర్‌ను కోరగా 5వేల రూపాయలు ఇవ్వాలని చెప్పడటంతో ఈనెల 18వ తేదీన రైతు నర్సింహ్మ మహబూబ్‌నగర్‌కు వెళ్లి ఏసిబి అధికారులను కలిశాడు.

ఏసిబి అధికారులు సోమవారం రైతునుంచి 5వేలు తీసుకొని పౌడర్ పూసిన డబ్బులను రైతుకు అందజేశారు. రైతు పాసుపుస్తకం తీసుకునేందుకు వీఆర్‌ఎ శ్రీధర్‌కు ఫోన్‌చేయగా పెద్దకొత్తపల్లి బస్టాండులో డబ్బులు ఇచ్చి పాసుపుస్తకం తీసుకోవాలని సూచించారు. ముందే బస్టాండుకు చేరుకున్న ఏసిబి అధికారులు రైతు డబ్బులు ఇచ్చి పాసుపుస్తకం తీసుకుంటుండగా వీఆర్‌ఎ శ్రీధర్‌ను పట్టుకున్నారు. తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి పాసుపుస్తకాలను, డబ్బులను సీజ్‌చేసి ఏసిబి అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అనంతరం మంగళవారం శ్రీధర్‌ను హైదరాబాద్‌లోని ఏసిబి జైలుకు తరలిస్తామని డీఎస్పీ తెలిపారు.

Peddakothapally VRA Trap in ACB net

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: