లోన్ ఇప్పిస్తానని 25 కోట్లు స్వాహా…

  తక్కువ వడ్డీకే రుణం అంటూ ఎలైట్ కనెక్ట్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ మాయ పంజాగుట్ట, బంజారాహిల్స్‌లో కాల్ సెంటర్లు: 8మంది అరెస్టు దేశవ్యాప్తంగా 600 మంది బాధితులు బాధితుల నుంచి 25కోట్లు వసూలు మనతెలంగాణ/హైదరాబాద్: తక్కువ వడ్డీకి వ్యక్తి గత రుణాలు ఇప్పిస్తానని చెప్పి ఫోన్ చేసి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న ముఠాను సైబర్ క్రైం సిసిఎస్ డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.80,000 నగదు, రెండు […]

 

తక్కువ వడ్డీకే రుణం అంటూ ఎలైట్ కనెక్ట్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ మాయ
పంజాగుట్ట, బంజారాహిల్స్‌లో కాల్ సెంటర్లు: 8మంది అరెస్టు
దేశవ్యాప్తంగా 600 మంది బాధితులు
బాధితుల నుంచి 25కోట్లు వసూలు
మనతెలంగాణ/హైదరాబాద్: తక్కువ వడ్డీకి వ్యక్తి గత రుణాలు ఇప్పిస్తానని చెప్పి ఫోన్ చేసి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న ముఠాను సైబర్ క్రైం సిసిఎస్ డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.80,000 నగదు, రెండు ల్యాప్‌టాప్‌లు, రౌటర్, 34 వైర్‌లెస్ టెలిఫోన్లు, 42 మొబైల్ ఫోన్లు, 21 సిమ్ కార్డులు, 60 లాంగ్ నోట్‌బుక్‌లు, బ్యాంకుల్లో ఉన్న రూ.6లక్షలను ఫ్రీజ్ చేశారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ బషీర్‌బాగ్‌లోని కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్, నిజాంపేటలకు చెందిన ఆశా కుమారి అమరనేని మేనేజర్, చెన్నైకు చెందిన మేనేజర్ రంగస్వామి గోపి బంజారాహిల్స్‌లో ఉంటున్నాడు. టీమ్ లీడర్లు జనుమ్‌పల్లి భూపాల్ రెడ్డి, చందానగర్, హైదరాబాద్, సికింద్రాబాద్‌కు చెందిన బేలూరి సాయిరామ్, కర్మాన్‌ఘాట్‌కు చెందిన గొర్రె నరేష్ యాదవ్, సోమాజిగూడకు చెందిన మహజబీన్ ఖాన్, అమీర్‌పేటకు చెందిన విజయలక్ష్మి, శంషాబాద్‌కు చెందిన రాచమల్ల అపూర్వను అరెస్టు చేశారు. మిగతా 41మందికి నోటీసులు జారీ చేశారు. వీరి చేతిలో మోస పోయిన ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.
తక్కువ వడ్డీ పేరుతో వల…
ఎలైట్ కనెక్ట్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆశా కుమారి, రంగస్వామి గోపి పంజాగుట్ట, బంజారాహిల్స్‌లో రెండు కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇద్దరు మేనేజర్లుగా వ్యవహరిస్తుండగా 60 మందిని టెలీకాలర్లుగా నియమించారు. ప్రజల ఫోన్ నంబర్లు సేకరించి వారికి టెలీ కాలర్లతో ఫోన్లు చేయించే వారు, కొందరితో మేనేజర్లు మాట్లాడేవారు. తాము మహింద్రా ఫైనాన్స్ నుంచి మాట్లాడుతున్నామని తక్కువ వడ్డికి రుణాలు ఇస్తామని రూ.10లక్షల వరకు లోన్లు ఇప్పిస్తామని చెబుతారు. ఏడాదికి 6.5శాతం వడ్డి మాత్రమే వసూలు చేస్తామని చెబుతారు. ఆసక్తి ఉంటే ఆధార్ కార్డు కాపీని తమ వాట్సాఫ్ నంబర్ 7305798729కు పంపించాలని కోరుతారు. పాన్, ఆధార్ కార్డు వివరాలు వచ్చాక మీకు లోన్ సాంక్షన్ అయిందని సెక్యూరిటీ డిపాజిట్ కింద రెండు ఈఎంఐల డబ్బులు బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయాలని కోరుతారు. అప్పడు రుణం తీసుకుంటామని చెప్పిన వారి డెబిట్ కార్టు నంబర్, సివివి నంబర్, ఎక్స్‌పైరీ తేదీ, ఓటిపి నంబర్‌ను కస్టమర్ నుంచి తెలుసుకుంటారు. అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత బ్యాంకులో ఉన్న డబ్బులను జస్ట్ డయల్ పే యూ ఈ కామర్స్ మర్చంట్ ద్వారా తమ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు. ఈ విధంగా 600మంది డెబిట్, ఓటిపి నంబర్లు వివరాలు సేకరించి ఇతర రాష్ట్రాలు, తెలంగాణకు చెందిన వారి నుంచి రూ.25కోట్ల రూపాయలు వసూలు చేశారు. వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలిసిందని సిపి తెలిపారు. సిసిఎస్ డిసిపి అవినాష్ మహంతి, అడిషనల్ డిసిపి రఘువీర్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ ప్రశాంత్, ఎస్సైలు తిమ్మప్ప, సురేష్, సిబ్బంది కేసు దర్యాప్తు చేశారు.

one arrested for cheating people with fake loan Offers

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: