అధికారుల వేధింపులు తాళలేక విఆర్‌ఎ ఆత్మహత్యాయత్నం

  మన తెలంగాణ/రామారెడ్డి : కామారెడ్డి జిల్లా  రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామం విఆర్‌ఎ రాజయ్య అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్నం చేసుకున్నట్లు గ్రామస్థుల పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో విఆర్‌ఎ తన పంట పొలానికి వాడే పురుగుల మందును తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. మోషంపూర్ విఆర్‌ఒ రవి తనను అనేక వేధింపులకు గురి చేస్తున్నాడని, గ్రామానికి ఒకే ఒక్క విఆర్‌ఎ ఉండడంతో పని భారం ఎక్కువ కావడంతో పై స్థాయి అధికారి వేధింపుల […]

 

మన తెలంగాణ/రామారెడ్డి : కామారెడ్డి జిల్లా  రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామం విఆర్‌ఎ రాజయ్య అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్నం చేసుకున్నట్లు గ్రామస్థుల పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో విఆర్‌ఎ తన పంట పొలానికి వాడే పురుగుల మందును తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. మోషంపూర్ విఆర్‌ఒ రవి తనను అనేక వేధింపులకు గురి చేస్తున్నాడని, గ్రామానికి ఒకే ఒక్క విఆర్‌ఎ ఉండడంతో పని భారం ఎక్కువ కావడంతో పై స్థాయి అధికారి వేధింపుల కారణంగానే రాజయ్య ఆత్మహత్య యత్నం చేసుకున్నట్లు గ్రామ ప్రజలు తెలిపారు. ఇప్పటికైనా విఆర్‌ఎల పని ఒత్తిడిని, భారాన్ని తగ్గించాలని మండల విఆర్‌ఎల సంఘం డిమాండ్ చేసింది. విఆర్‌ఎ ఆత్మహత్యకు కారణమైన విఆర్‌ఒను వెంటనే విధుల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

 

VRA Suicide Attempt in Kamareddy in Telangana

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: