ప్రధాని మోడీకి అశ్విన్ అభ్యర్థన

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓటర్లను ఉత్తేజపరిచి ఓటింగ్ శాతం పెంచాలంటూ సినీ, క్రీడలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ట్విట్టర్ ద్వారా అభ్యర్థించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రధాని అభ్యర్థనపై స్పందించారు. తాజాగా భారత స్పిన్నర్, కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ కెప్టెన్ రవిచం​ద్రన్‌ అశ్విన్‌ స్పందించారు. దేశంలోని ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం అందిరి బాధ్యత అని, సరైన నేతను ఎన్నుకొని […]

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓటర్లను ఉత్తేజపరిచి ఓటింగ్ శాతం పెంచాలంటూ సినీ, క్రీడలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ట్విట్టర్ ద్వారా అభ్యర్థించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రధాని అభ్యర్థనపై స్పందించారు. తాజాగా భారత స్పిన్నర్, కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ కెప్టెన్ రవిచం​ద్రన్‌ అశ్విన్‌ స్పందించారు. దేశంలోని ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం అందిరి బాధ్యత అని, సరైన నేతను ఎన్నుకొని దేశాభివృద్ధిలో భాగం కావాలని ట్వీట్ చేశారు. ఈ మేరకు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రధాని మోడీకి ఈ సందర్భంగా ఓ రిక్వెస్ట్ చేశారు. ఐపిఎల్‌ ఆడుతున్న క్రికెటర్లకు దేశంలో ఎక్కడైనా ఓటు వేసే అవకాశం కల్పించాలని అశ్విన్‌ అభ్యర్థించారు. ఎన్నికల నిబంధనలు సవరించి ఐపిఎల్‌ ఆటగాళ్లు ఎక్కడైనా ఓటు వేసే అవకాశం కల్పించాలని ప్రధానికి అశ్విన్‌ ట్విట్టర్ వేదికగా విన్నవించారు.

Ravichandran Ashwin Tweets to PM Modi

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: