‘మన్మథుడు 2’ సినిమా ప్రారంభం

  హైదరాబాద్‌: 2002లో వచ్చిన అక్కినేని నాగార్జున బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘మన్మథుడు’కు సీక్వెల్‌ రూపొందుతుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం ‘మన్మథుడు 2’ సినిమా ప్రారంభమైంది. కార్యక్రమానికి చిత్ర బృందంతోపాటు నాగ్‌ కుటుంబ సభ్యులు అమల, నాగచైతన్య తదితరులు హాజరయ్యారు. అమల అక్కినేని ఫస్ట్ క్లాప్ కొట్టగా.. నాగ చైతన్య కెమెరా స్విచాన్ చేశాడు. ఈ సినిమాకు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించబోతున్నారు. నాగార్జున సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించనుంది. ఈ సినిమాను నాగార్జున, పీ కిరణ్ సంయుక్తంగా […]

 

హైదరాబాద్‌: 2002లో వచ్చిన అక్కినేని నాగార్జున బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘మన్మథుడు’కు సీక్వెల్‌ రూపొందుతుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం ‘మన్మథుడు 2’ సినిమా ప్రారంభమైంది. కార్యక్రమానికి చిత్ర బృందంతోపాటు నాగ్‌ కుటుంబ సభ్యులు అమల, నాగచైతన్య తదితరులు హాజరయ్యారు. అమల అక్కినేని ఫస్ట్ క్లాప్ కొట్టగా.. నాగ చైతన్య కెమెరా స్విచాన్ చేశాడు.

ఈ సినిమాకు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించబోతున్నారు. నాగార్జున సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించనుంది. ఈ సినిమాను నాగార్జున, పీ కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ యూరప్ లో ప్రారంభం కానుంది. ఆర్‌ఎక్స్ 100 ఫేం చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత అందించనున్నాడు.

Related Stories: