టిఆర్‌ఎస్‌కు ప్రత్యర్థులే లేరు: హరీష్

      హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలు చారిత్రాత్మకమైనవని ఎంఎల్‌ఎ హరీష్ రావు తెలిపారు. సోమవారం హరీష్ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో టిఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్, బిజెపి నేతలు తంటాలు పడుతున్నారని విమర్శలు గుప్పించారు. సిద్దిపేటలో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని హరీష్ ధీమా వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని కొనియాడారు. ప్రధాని […]

 

 

 

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలు చారిత్రాత్మకమైనవని ఎంఎల్‌ఎ హరీష్ రావు తెలిపారు. సోమవారం హరీష్ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో టిఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్, బిజెపి నేతలు తంటాలు పడుతున్నారని విమర్శలు గుప్పించారు. సిద్దిపేటలో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని హరీష్ ధీమా వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు తెలంగాణను చిన్నచూపు చూస్తున్నారని హరీష్ ఎద్దేవా చేశారు. కేంద్రంలో కాంగ్రెస్, బిజెపి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, ఏప్రిల్ 3న నర్సాపూర్‌లో జరిగే సిఎం కెసిఆర్ సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

 

No Opposition in Parliament Elections in Telangana

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: