మత్స్యకారుల వలకు చిక్కిన మొసలి పిల్ల !

భద్రాద్రి కొత్తగూడెం: మత్స్యకారుల వలకు మొసలి పిల్ల చిక్కిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలోని కోళ్లచెరువులో చోటు చేసుకుంది. బూర్గంపాడు పరిధిలోని కోళ్లచెరువులో మత్స్యకారులు చేపల కోసం వల వేయగా దానిలో మొసలి పిల్ల చిక్కింది. దాంతో వెంటనే మత్స్యకారులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. మత్స్యకారుల సమాచారంతో కోళ్లచెరువు వద్దకు చేరుకున్న అధికారులు మొసలి పిల్లను స్వాధీనం చేసుకున్నారు. మత్స్యకారులు అటవీశాఖ బీట్ ఆఫీసర్ అలివేలు మంగకు దాన్ని అప్పగించారు. కాగా, చెరువులో మొసలి దొరకడంతో […]

భద్రాద్రి కొత్తగూడెం: మత్స్యకారుల వలకు మొసలి పిల్ల చిక్కిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలోని కోళ్లచెరువులో చోటు చేసుకుంది. బూర్గంపాడు పరిధిలోని కోళ్లచెరువులో మత్స్యకారులు చేపల కోసం వల వేయగా దానిలో మొసలి పిల్ల చిక్కింది. దాంతో వెంటనే మత్స్యకారులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. మత్స్యకారుల సమాచారంతో కోళ్లచెరువు వద్దకు చేరుకున్న అధికారులు మొసలి పిల్లను స్వాధీనం చేసుకున్నారు. మత్స్యకారులు అటవీశాఖ బీట్ ఆఫీసర్ అలివేలు మంగకు దాన్ని అప్పగించారు. కాగా, చెరువులో మొసలి దొరకడంతో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. చెరువులో మరిన్ని మొసళ్లు ఉండే అవకాశం ఉందని వారు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.

Crocodile Trapped in Fish Net at Bhadradri Kothagudem

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: