సన్‌రైజర్స్‌పై కోల్‌కతా అద్భుత విజయం

  కోల్‌కతా:ఐపిఎల్-12 సీజన్ లో భాగంగా ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఘనవిజయం సాధించింది. సన్‌రైజర్స్ నిర్ధేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా జట్టు కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కల్పోయి 19.4 ఓవర్లో 183 పరుగులు చేసి గెలుపొందింది. నితిష్ రానా 68, రాబిన్ ఊతప్ప 35 పరుగులతో రాణించారు. లక్ష్యానికి ఇంకా 28 బంతుల్లో 64 పరుగుల చేయాల్సిన దశలో ఆండ్రూ రస్సెల్ సిక్స్ లు, ఫోర్లతో […]

 

కోల్‌కతా:ఐపిఎల్-12 సీజన్ లో భాగంగా ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఘనవిజయం సాధించింది. సన్‌రైజర్స్ నిర్ధేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా జట్టు కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కల్పోయి 19.4 ఓవర్లో 183 పరుగులు చేసి గెలుపొందింది. నితిష్ రానా 68, రాబిన్ ఊతప్ప 35 పరుగులతో రాణించారు.

లక్ష్యానికి ఇంకా 28 బంతుల్లో 64 పరుగుల చేయాల్సిన దశలో ఆండ్రూ రస్సెల్ సిక్స్ లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. సిద్ధార్థ్ కౌల్ వేసిన 18వ ఓవర్‌లో 19 పరుగులు రాబట్టిన రసూల్… తర్వాత భువనేశ్వర్ ఓవర్‌లో 4, 6, 4, 6 బాది 21 పరుగులు రాబట్టాడు. ఆఖరి ఓవర్‌లో శుబ్‌మన్ గిల్ రెండు సిక్సర్లు బాది విజయాన్ని ముగించాడు. రసూల్ కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 పరుగులు చేయగా, గిల్ 10 బంతుల్లో 18 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు.

Related Stories: