ఎండలకు తగ్గిన పర్యాటకులు

మన తెలంగాణ/నాగార్జునసాగర్: పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌లోని లాంచీస్టేషన్‌లో ప్రర్యాటకులకు అసౌకర్యాలు పలకరిస్తున్నాయి. మార్చినెలలోనే నాగార్జునసాగర్‌లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సాగర్‌కు వచ్చే పర్యాటకులకు లాంచీస్టేషన్ వద్ద సరైన సౌకర్యాలు లేవని పలువురు పర్యాటకులు వాపోతున్నారు. లాంచీస్టేషన్ వద్ద పర్యాటకులు కూర్చోడానికి సరైన సౌకర్యాలు లేవని. లాంచీష్టేషన్ వద్ద పర్యాటకులు ఎండలోనే లాంచీప్రయాణంకొరకు వేచి ఉండటం పర్యాటకులలో తీవ్రమైన అసౌకర్యాంకు గురవుతున్నారు. పర్యాటకులకు ఇక్కడ కనీస సౌకర్యాలు కల్పంచ లేదని వారు ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన […]

మన తెలంగాణ/నాగార్జునసాగర్: పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌లోని లాంచీస్టేషన్‌లో ప్రర్యాటకులకు అసౌకర్యాలు పలకరిస్తున్నాయి. మార్చినెలలోనే నాగార్జునసాగర్‌లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సాగర్‌కు వచ్చే పర్యాటకులకు లాంచీస్టేషన్ వద్ద సరైన సౌకర్యాలు లేవని పలువురు పర్యాటకులు వాపోతున్నారు. లాంచీస్టేషన్ వద్ద పర్యాటకులు కూర్చోడానికి సరైన సౌకర్యాలు లేవని. లాంచీష్టేషన్ వద్ద పర్యాటకులు ఎండలోనే లాంచీప్రయాణంకొరకు వేచి ఉండటం పర్యాటకులలో తీవ్రమైన అసౌకర్యాంకు గురవుతున్నారు. పర్యాటకులకు ఇక్కడ కనీస సౌకర్యాలు కల్పంచ లేదని వారు ఆరోపిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2016 అగస్టు 3వ తేదిన హిల్‌కాలనీలోని ఎర్తుడ్యాం వద్ద తాత్కాలిక లాంచీస్టేషన్ ఎర్పాటు చేశారు. అప్పటి నుండి లాంచీలను నాగార్జునకొండకు నడుపుతున్నారు. ముఖ్యంగా సెలవు దినాలలో పర్యాటకుల రద్దీగా ఉంటుంది. నాగార్జునకొండకు ఇక్కడి నుండి లాంచీటికెట్ పెద్దలకు 150 రుపాయలు, పిల్లలకు 120 రుపాయలు టికెట్ ఉంటుంది. లాంచీస్టేషన్ వద్ద కనీస సౌకర్యాలు లేక పోవడంతో ఎండలకు పర్యాటకులు లాంచీస్టేషన్ వద్ద వేచి ఉండలేక లాంచీ ప్రయాణం చేయకుండానే వెను తిరుగుతున్నట్లు పలువురు వాపోతున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి లాంచీస్టేషన్ వద్ద పర్యాటకులకు కావలసిన మౌళిక సౌకర్యాలను కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు.

Tourists Decreased in Nagarjuna Sagar

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: