పాత్రికేయులకు అండగా తెలంగాణ ప్రభుత్వం

* జర్నలిస్టుల ప్రతి సమస్యను పరిష్కరిస్తాం * ప్రజా చైతన్యం కోసం పాత్రికేయులు పని చేయాలి * టీయూడబ్ల్యూజే మహాసభ విజయవంతం * రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి: పాత్రికేయ వృత్తి ఎంతో గొప్పదని, ప్రతి పాత్రికేయునికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన టీయూడబ్ల్యూజే(హెచ్143) నాల్గవ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా జర్నలిస్టు అమరవీరులకు […]

* జర్నలిస్టుల ప్రతి సమస్యను పరిష్కరిస్తాం
* ప్రజా చైతన్యం కోసం పాత్రికేయులు పని చేయాలి
* టీయూడబ్ల్యూజే మహాసభ విజయవంతం
* రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

పెద్దపల్లి: పాత్రికేయ వృత్తి ఎంతో గొప్పదని, ప్రతి పాత్రికేయునికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన టీయూడబ్ల్యూజే(హెచ్143) నాల్గవ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా జర్నలిస్టు అమరవీరులకు రెండు నిమిషాలపాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టుల ప్రతి సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం అనంతరం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్, ప్రభుత్వం పని చేస్తోందని, అందులో భాగంగానే జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేస్తోందన్నారు. హెల్త్‌కార్డులు, అక్రిడేషన్‌కార్డులు, పాత్రికేయలకు ప్రత్యేక సంక్షేమ నిధులను కేటాయించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు.

అనంతరం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ పాత్రికేయుల సంక్షేమం కోసం మరిన్ని ప్రభుత్వ పథకాల ద్వారా ఇళ్ల స్థలాలు, తదితర అంశాలను సాధించుకోవాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి జర్నలిస్టులకు న్యాయం చేస్తామన్నారు. ప్రజల్లో చైతన్య విలువలు నింపే విధంగా పాత్రికేయులు పని చేయాలన్నారు. మృతి చెందిన పాత్రికేయ కుటుంబాలను ఆదుకోవడానికి బీమా సౌకర్యం, పింఛన్‌లాంటి సౌకర్యాలను ఏర్పరిచి, పాత్రికేయుల పిల్లలకు 50శాతం సబ్సిడీ ద్వారా ఉన్నత విద్యను అందజేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. అలాగే ప్రెస్‌అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాత్రికేయుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ముందుందని, పాత్రికేయుల సంక్షేమనిధికి రూ.100 కోట్లు కేటాయించడం హర్షనీయమన్నారు. రాష్ట్రంలో పాత్రికేయులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యల పట్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పాత్రికేయ వృత్తి న్యాయం చేయాలన్నారు.

అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిలను శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించి మెమోంటోలను అందజేశారు. టీయూడబ్ల్యూజే(ఐజేయూ)కు చెందిన సుమారు 30మంది జర్నలిస్టులు ప్రెస్‌అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సమక్షంలో టీయూడబ్ల్యూజే(హెచ్143)లో చేరారు. పెద్దపల్లి టీయూడబ్ల్యూజే యూనియన్ అధ్యక్షుడు కట్ట నరేందర్, టెంజు జిల్లా అధ్యక్షుడు కొట్టె సదానందం అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు మారుతిసాగర్, ఇస్మాయిల్, బిజిగిరి శ్రీనివాస్, రాంగోపాల్, ఎర్రోజు వేణుగోపాల్, లాయక్‌పాషా, జెర్రిపోతుల సంపత్, బోనాల తిరుమల్, జిల్లా కన్వీనర్లు నరేంద్రచారి, సదానందం, సీనియర్ నాయకులు తన్నీరు రాజేందర్, పూసాల మోహన్, లక్ష్మీనారాయణ, తిర్రి తిరుపతిగౌడ్, కొల్లూరి గోపాల్, తిరుపతియాదవ్, వడ్డేపల్లి రవీందర్, వెంకట ప్రసాద్, రవి, దేవి మల్లయ్య, కమలాకర్, సమ్మయ్య, తిరుపతి, మధుసూదన్, ఉమ్మడి జిల్లా యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు, టెంజు అధ్యక్ష, కార్యదర్శులతోపాటు వివిధ ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లాల నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.

Minister Koppula Eshwar says Telangana Govt Supports Journalists

Related Stories: