సుక్కు కోసం టిడిపి, జనసేన పోటాపోటీ

టాలీవుడ్ టాప్ డైరెక్టర్, లెక్కల మాస్టారు సుకుమార్ క్రేజ్ ‘రంగస్థలం’ చిత్రం తరువాత అమాంతం పెరిగిపోయింది. చిన్న హీరోలు మొదలుకొని, స్టార్ హీరోల వరకు ఒక్కసారైన సుక్కుతో పనిచేయాలని కోరుకుంటున్నారు. తనదైన శైలిలో చిత్రాలు తెరకెక్కించే సుకుమార్ తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలాఉంటే ప్రస్తుతం ఎపిలో వివిధ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సుక్కు క్రేజీ దృష్ట్యా ఆయన చేత ప్రచారం […]

టాలీవుడ్ టాప్ డైరెక్టర్, లెక్కల మాస్టారు సుకుమార్ క్రేజ్ ‘రంగస్థలం’ చిత్రం తరువాత అమాంతం పెరిగిపోయింది. చిన్న హీరోలు మొదలుకొని, స్టార్ హీరోల వరకు ఒక్కసారైన సుక్కుతో పనిచేయాలని కోరుకుంటున్నారు. తనదైన శైలిలో చిత్రాలు తెరకెక్కించే సుకుమార్ తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలాఉంటే ప్రస్తుతం ఎపిలో వివిధ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సుక్కు క్రేజీ దృష్ట్యా ఆయన చేత ప్రచారం చేయించి లబ్ధిపొందాలని వివిధ పార్టీలు పోటీపడుతున్నాయి. లెక్కల మాస్టార్ తో ప్రచారం చేయించాలని టిడిపి, జనసేన అభ్యర్థులు పోటీ పడుతున్నారట. సుక్కు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా మలికిపురం. ఎన్నికలు సమీపిస్తుండడంతో మలికిపురంలో టిడిపి తరఫున పోటీ చేస్తున్న గొల్లపల్లి సూర్యారావు, జనసేన తరఫున పోటీ చేస్తున్న రాపాక ప్రసాదరావులు విడివిడిగా సుక్కు ఇంటికెల్లి మరి తమకు మద్దతుగా ప్రచారం చేయాలని కోరారట. ఇక సుకుమార్ వారి అభ్యర్థనను మన్నించి ప్రచారం చేస్తారేమో చూడాలి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నేతల ప్రచారం జోరందుకుంది. ఉదయం నుంచి రాత్రి వరకూ నాయకులు ఎన్నికల ప్రచారంలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగనున్నాయి.

Janasena, TDP ask Sukumar for Election Campaign

Related Stories: