ఏడుపాయలకు భారీగా తరలివచ్చిన భక్తులు

పాపన్నపేట (మెదక్) : పవిత్ర పుణ్యక్షేత్రమై శ్రీ ఏడుపాయల వనదుర్గాభావాని మాత ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. ఆదివారం సెలవు దినం కావడంతో మండలంలోని ఆయా గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తుల తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం పూర్తిగా భక్తులో కిక్కిరిసిపోయింది. అమ్మవారి దర్శనం కోసం భక్తులకు సుమారు గంట పాటు వేచివుండాల్సి వచ్చింది. ఆలయ అర్చకులు నర్సింహాచారి, శంకర్‌శర్మ, మురళిచారిలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు […]

పాపన్నపేట (మెదక్) : పవిత్ర పుణ్యక్షేత్రమై శ్రీ ఏడుపాయల వనదుర్గాభావాని మాత ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. ఆదివారం సెలవు దినం కావడంతో మండలంలోని ఆయా గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తుల తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం పూర్తిగా భక్తులో కిక్కిరిసిపోయింది. అమ్మవారి దర్శనం కోసం భక్తులకు సుమారు గంట పాటు వేచివుండాల్సి వచ్చింది. ఆలయ అర్చకులు నర్సింహాచారి, శంకర్‌శర్మ, మురళిచారిలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం ముందుగల సంతాన గుండంలో సంతనం కలుగాలని పలువురు దంపతులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం పలువురు భక్తులు వివిధ రూపాల్లో మొక్కులను చెల్లించుకున్నారు.  కొంత మంది భక్తులు శివసత్తుల పూనకాలతో, డప్పుచప్పుళ్ల మేళాలతో ఊరేగింపుగా బోనాలు, ఓడిబియ్యం తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి వివిధ రూపాల్లో మొక్కులను చెల్లించారు. ఏడుపాయల ప్రాంగణంలోని చెట్లు, బండరాళ్ల మధ్య భక్తులు వన భోజనాలు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి మోహన్‌రెడ్డి, ఆలయ చైర్మేన్ పట్లోళ్ల విష్ణువర్ధన్‌రెడ్డి, ఆలయ సిబ్బంది జెన్నరవికుమార్, సిద్దిపేట శ్రీనివాస్, లక్ష్మినారాయణ, సూర్య శ్రీనివాస్, మధుసూదన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్‌శర్మ, తదీతరులు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఏడుపాయలలో ఎలాంటి వాంచనీయ సంఘటనలు జరుగకుండా పాపన్నపేట ఎస్ ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు.

Devotees Rush at Edupayala Temple on Sunday

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: