ఈ భామకు 60 ఏళ్లు!

  బార్బీ బొమ్మ పుట్టి ఇప్పటికి 60 ఏళ్లు అయ్యింది. 1959 మార్చి 9న తొలిసారి అమెరికాకు చెందిన బొమ్మల కంపెనీ ‘మాటెల్’ బార్బీ బొమ్మను తయారు చేసి న్యూయార్క్ టాయ్ ఫెయిర్‌లో ప్రదర్శనకు పెట్టింది. తొలి చూపులోనే అందరినీ ఆకర్షించింది. తక్కువ సమయంలోనే దేశదేశాల్లోకి పాకిపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎందరో అభిమానుల్ని సంపాదించుకుంది. 1959లో అమ్మిన మొదటి బార్బీ బొమ్మ ధర మూడు డాలర్లు. ఈ బొమ్మ పూర్తి పేరు ‘బార్బరా మిల్లి […]

 

బార్బీ బొమ్మ పుట్టి ఇప్పటికి 60 ఏళ్లు అయ్యింది. 1959 మార్చి 9న తొలిసారి అమెరికాకు చెందిన బొమ్మల కంపెనీ ‘మాటెల్’ బార్బీ బొమ్మను తయారు చేసి న్యూయార్క్ టాయ్ ఫెయిర్‌లో ప్రదర్శనకు పెట్టింది. తొలి చూపులోనే అందరినీ ఆకర్షించింది. తక్కువ సమయంలోనే దేశదేశాల్లోకి పాకిపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎందరో అభిమానుల్ని సంపాదించుకుంది. 1959లో అమ్మిన మొదటి బార్బీ బొమ్మ ధర మూడు డాలర్లు. ఈ బొమ్మ పూర్తి పేరు ‘బార్బరా మిల్లి సెంట్ రాబర్ట్‌”.

మొట్టమొదటి బార్బీ నలుపు తెలుపు స్విమ్‌సూట్‌లో ఉండేది. తొలి రోజుల్లో ఈ బొమ్మలు జపాన్‌లో తయారయ్యేవి. వీటి అదిరేటి డ్రస్సుల్ని జపనీయులు చేతితో కుట్టేవారు. ఈ బొమ్మ 11.5 అంగుళాల ఎత్తు ఉంటుంది. దీని మొదటి పెంపుడు జీవి గుర్రం. దాని పేరు డ్యాన్సర్. దీని సృష్టికర్త రూథ్ హాండ్లర్. ఆయన కూతురు బార్బరా పేపర్ బొమ్మలతో ఆడుకోవడాన్ని చూసి బార్బీ బొమ్మను తయారుచేశాడు. ప్రపంచానికి పరిచయమైన తొలి ఏడాదిలోనే మూడు లక్షల 50 వేలకుపైగా అమ్ముడుపోయాయి. బార్బీని 1965లోనే అంతరిక్షంలోకి పంపారు. ఆ తర్వాత 1986, 1994 సంవత్సరాల్లోనూ వెళ్లింది. ఎత్తు మడమల చెప్పులతో ఉండే బార్బీలు 2015లో ఫ్లాట్స్ వేసుకుని మెరిశాయి.

మన దేశ సంప్రదాయ అలంకరణలతోనూ మెరిశాయివి. చీరకట్టుతో ఆకట్టుకున్నాయి. పెళ్లి కూతురుగా మురిపించాయి. అలా దాదాపు 40 దేశాల సంప్రదాయాల్లో కనిపించాయి. బార్బీ బర్త్‌డే సందర్భంగా దీని అభిమానులు కేకులు కట్ చేస్తూ సంబరాలు చేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా బార్బీ బొమ్మలు సెకనుకు రెండు అమ్ముడుపోతాయి. అంటే రోజుకు ఒక లక్షా 72 వేలకు పైమాటే! బార్బీ వివరాలతో ఓ పుస్తకం ఉంది. దాని పేరు ‘ద వరల్డ్ ఆఫ్ బార్బీ’.

ప్రపంచవ్యాప్తంగా బార్బీ బొమ్మలు సేకరించేవారి సంఖ్య లక్షదాకా ఉంటుంది. అయితే వాళ్లందరిలో జర్మనీకి చెందిన ‘బెట్టినా డార్ఫ్‌మన్’కు ఎక్కువ బొమ్మలున్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డు దక్కింది. ఈమె 15 వేల బొమ్మలను సేకరించింది.
విద్యార్థి, వైద్యులు, మోడల్, డ్యాన్సర్, వ్యోమగామి, రోబోటిక్ ఇంజినీర్, జర్నలిస్ట్ ఇలా ఒక్కటేంటీ టీచర్ నుంచి పారిశ్రామికవేత్త వరకూ దాదాపు 200 రకాలుగా అవతారాలెత్తిందిది. అన్ని వృత్తుల్లోనూ దర్శనమిచ్చింది. 1997లో వీల్‌చెయిర్ బార్బీని తయారు చేశారు. దివ్యాంగులైన పిల్లల్లో ఆత్మవిశ్వాసం, సంతోషం నింపడానికి ఈ వీల్‌చెయిర్ బార్బీబొమ్మను తయారుచేశారు.

తైవాన్‌లోని తైపీ నగరంలో ‘బార్బీ కేఫ్’ ఉంది. దీంట్లోకి వెళితే ఎక్కడ చూసినా ఈ బొమ్మలే. హోటల్ గోడలు, తలుపులు, కిటికీలు అంతా గులాబీ రంగులోనే ఉంటాయి. ఇక్కడ కావాల్సినవి అందించే వాళ్లు కూడా బార్బీ దుస్తులు వేసుకుని అచ్చం బార్బీ బొమ్మల్లానే తయారవుతారు. కేక్‌లు, ఆహార పదార్థాలూ బార్బీ బొమ్మల్లా ఉంటాయి. ఫేస్‌బుక్ పేజీకి కోటీ 40 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇతర సోషల్ మీడియాలోనూ ఫాలోవర్స్ ఎక్కువే.

1. బార్బీ యూట్యూబ్ ఛానల్‌కి 50 లక్షల మంది అభిమానులుఉండటం విశేషం.
2. చూడముచ్చటైన రూపాల్లోనే కాదు… నలుపు రంగులో, రకరకాల జుత్తులతోనూ వచ్చింది.
3. అన్ని బార్బీల్లో 1992లో వచ్చిన తల నుంచి కాలి బొటనవేలి వరకు పొడవైన వెంట్రుకలతో ఉన్న టోటల్ హెయిర్ డాల్ ఎక్కువగా ఆకట్టుకుంది.

Completed 60 years to Iconic Barbie doll

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: