ఉపాధి కల్పనలో తెలంగాణ మేటి

ఎంఎస్‌ఎంఇ రంగంలో పెరిగిన ఉద్యోగాలు సిఐఐ సర్వేలో వెల్లడి హైదరాబాద్: ఉపాధి కల్పనలో తెలంగాణ రాష్ట్రానికి దేశంలో ప్రముఖ స్థానం లభించింది. గడిచిన నాలుగేళ్లలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఎంఇ) రంగంలో తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో అత్యధిక ఉపాధి అవకాశాలు లభించాయని భారత పరిశ్రమల సమాఖ్య(సిఐఐ) వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడవ […]

ఎంఎస్‌ఎంఇ రంగంలో పెరిగిన ఉద్యోగాలు
సిఐఐ సర్వేలో వెల్లడి
హైదరాబాద్: ఉపాధి కల్పనలో తెలంగాణ రాష్ట్రానికి దేశంలో ప్రముఖ స్థానం లభించింది. గడిచిన నాలుగేళ్లలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఎంఇ) రంగంలో తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో అత్యధిక ఉపాధి అవకాశాలు లభించాయని భారత పరిశ్రమల సమాఖ్య(సిఐఐ) వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడవ స్థానంలో నిలిచింది. నిరుద్యోగ సమస్యను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయి. ప్రధానంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగంలో ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో ఏటా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.

2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో వరకు ఎంఎస్‌ఎంఇ రంగంలో 3,32,394 కొత్త ఉద్యోగాలు సృష్టిస్తే అందులో తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలోనే 50 శాతానికిపైగా ఉద్యోగాలు సృష్టించబడ్డాయని సిఐఐ సర్వే వెల్లడించింది. ఈ కాలంలో ఎంఎస్‌ఎంఇ రంగం ఉద్యోగాల కల్పనలో 13.9 శాతం వృద్దిని సాధించిందని సిఐఐ రూపొందించిన నివేదిక తెలిపింది. సూక్ష్మ తరహా పరిశ్రమల రంగంలోనే అత్యధిక ఉద్యోగాలు లభించినట్లు తెలిపింది. గడిచిన నాలుగేళ్లలో ఈ రంగంలోనే 2,40,713(73 శాతం) కొత్త ఉద్యోగాలు కల్పించినట్లు సర్వే వెల్లడించింది. ఆ తర్వాత చిన్న తరహా పరిశ్రమల్లో 23 శాతం ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపింది.

మధ్య తరహా పరిశ్రమల రంగంలో 4 శాతం మాత్రమే ఉద్యోగాలు కల్పించినట్లు నివేదిక పేర్కొంది. ఇందులో హాస్పిటాలిటీ, టూరిజం రంగంలో 12 శాతం, టెక్స్‌టైల్, అప్పరల్, మెటల్ రంగంలో 8 శాతం, మిషనరీ విభాగాల రంగంలో 7 శాతం ఉద్యోగాలు కల్పించినట్లు సర్వే వెల్లడించింది. ఈ నాలుగు రంగాలలో 40 శాతానికి పైగా ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపింది. ఎంఎస్‌ఎంఇ రంగంలో ఏడాదిలోపు 5,70,804 ఉద్యోగాలు కల్పించే అవకాశాలు ఉన్నట్లు సర్వే తెలిపింది. వచ్చే ఏడాదికి ఎంఎస్‌ఎంఇ రంగం ఉద్యోగాల కల్పనలో 21 శాతం వృద్దిని సాధించే అవకాశం ఉన్నట్లు సిఐఐ సర్వే వెల్లడించింది.

Telangana got a prominent place in Employment Generation

Related Images:

[See image gallery at manatelangana.news]