పెరుగుతో ఆరోగ్యం మెరుగు!

  ఎండలు మొదలయ్యాయి. వడగాలుల సమస్య కూడా రాబోతుంది. మరి ఇలాంటి సమయంలో మన ఆరోగ్యాన్ని ‘కవచం’లా కాపాడే ’పెరుగు’ను వరంగా భావించవచ్చు. ఇప్పటివరకు పెరుగును దూరంగా పెట్టినవాళ్లు… దానివల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు.. మెదడు చురుగ్గా పనిచేయడంలో పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. వేసవికాలంలో పెరుగు, మజ్జిగ తీసుకుంటే శరీరం వేసవి తాపానికి గురికాకుండా ఉంటుంది. ఆహార నియమాల్లో పెరుగు, మజ్జిగకు ప్రత్యేక స్థానం కల్పిస్తే ఇక అనారోగ్య సమస్యలు దూరమైనట్టే… పెరుగులో కాల్షియం […]

 

ఎండలు మొదలయ్యాయి. వడగాలుల సమస్య కూడా రాబోతుంది. మరి ఇలాంటి సమయంలో మన ఆరోగ్యాన్ని ‘కవచం’లా కాపాడే ’పెరుగు’ను వరంగా భావించవచ్చు. ఇప్పటివరకు పెరుగును దూరంగా పెట్టినవాళ్లు… దానివల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..

మెదడు చురుగ్గా పనిచేయడంలో పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. వేసవికాలంలో పెరుగు, మజ్జిగ తీసుకుంటే శరీరం వేసవి తాపానికి గురికాకుండా ఉంటుంది. ఆహార నియమాల్లో పెరుగు, మజ్జిగకు ప్రత్యేక స్థానం కల్పిస్తే ఇక అనారోగ్య సమస్యలు దూరమైనట్టే…

పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. దీనివల్ల ఎముకలు గట్టిపడతాయి.
1. అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు రోజూ కప్పు పెరుగు తింటే మంచి ఫలితం ఉంటుంది.
2. తీవ్ర జలుబుతో బాధపడేవారు… పెరుగులో కాస్త మిరియాల పొడి, బెల్లం పొడి కలిపి తింటే ఉపశమనం కలుగుతుంది.
3. నేరుగా పెరుగు తినడం ఇష్టంలేనివారు, మజ్జిగ రూపంలో తీసుకోవచ్చు.
4. మజ్జిగలో కాస్త నిమ్మరసం, ఉప్పు, జీలకర్ర పొడి కలుపుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో డీహైడ్రేషన్ సమస్యలు ఉండవు.
5. వేడి వేడి అన్నంలో పెరుగు కలుపుకని తింటే విరేచనాలు తగ్గుతాయి.
6. జిగట విరేచనాలతో బాధపడేవారు పెరుగులో కొంచెం మెంతులు కలుపుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది.
7. వాతం, కఫాలను తగ్గించే గుణాలు పెరుగులో పుష్కలంగా ఉన్నాయి.
8. పెరుగులో కాస్త్త ఉప్పు కలుపుకుని తినడం వల్ల అజీర్తి సమస్యలు తగ్గుతాయి.
9. శరీరంలో నీరు చేరినవారు పెరుగును ఎక్కవగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
10. అల్సర్‌తో బాధపడేవారు పెరుగు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
ముఖ్యంగా చాలామంది పెరుగులో చక్కెర కలుపుకుని తింటుంటారు. ఇలా తింటే వారి ఆరోగ్యానికి చాలా ప్రమాదం. శరీరంలో కొవ్వు శాతం పెరగడమే కాకుండా మధుమేహానికి దారితీస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.

Health benefits with Curd in Summer Season

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: