పట్టాలపై పరిగెత్తిన పోలీసు

హోషంగాబాద్: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓయువకుడి ప్రాణాలు కాపాడటానికి ఓ పోలీసు కానిస్టేబుల్ చూపిన ఔదార్యం అందరి మన్ననలు పొందుతోంది. వాహనాల రాకపోకలకు అనువుగా లేని ప్రాంతంలో గాయపడిన వ్యక్తిని కొంతదూరం భుజాల మీద మోస్తూ, పట్టాల మీద పరిగెత్తిన వైనం మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం… అజిత్ అనే 20 ఏళ్ల యువకుడు రైలు నుంచి కిందపడి, పట్టాలకు దగ్గర్లో పడిపోయి ఉన్నాడు. దాన్ని గమనించి ఓ వ్యక్తి పోలీసులకు  సమాచారం […]

హోషంగాబాద్: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓయువకుడి ప్రాణాలు కాపాడటానికి ఓ పోలీసు కానిస్టేబుల్ చూపిన ఔదార్యం అందరి మన్ననలు పొందుతోంది. వాహనాల రాకపోకలకు అనువుగా లేని ప్రాంతంలో గాయపడిన వ్యక్తిని కొంతదూరం భుజాల మీద మోస్తూ, పట్టాల మీద పరిగెత్తిన వైనం మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం… అజిత్ అనే 20 ఏళ్ల యువకుడు రైలు నుంచి కిందపడి, పట్టాలకు దగ్గర్లో పడిపోయి ఉన్నాడు. దాన్ని గమనించి ఓ వ్యక్తి పోలీసులకు  సమాచారం అందించాడు. దీంతో కానిస్టేబుల్ పూనమ్ బిల్లోర్‌, డ్రైవర్‌ రాహుల్ సకల్లేతో పాటు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో బిల్లోర్‌ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అజిత్‌ను భుజాల మీద వేసుకొని పట్టాల మీద పరిగెత్తాడు. ఎందుకంటే వారు తెచ్చిన వాహనం కిలో మీటరు పైగా దూరంలో ఉంది. పక్కనున్న పట్టాల మీద రైలు వెళ్తున్నా అదేమి పట్టించుకోకుండా బిల్లోర్..అతడిని పోలీసు వాహనం వద్దకు చేర్చాడు. సమాచారం అందించిన వ్యక్తే ఆ సంఘటన  వీడియో తీసి  సామాజిక మాధ్యమాల్లో ఫోస్ట్ చేశాడు.దీంతో  చక్కర్లు కొడుతోన్న ఆ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా సమాచారం.

young man injured on railway track in madhya pradesh

 

Related Stories: