ఏ పదవిలో ఉన్న దళితులే….?

కోనరావుపేటః పల్లెల్లో మారనీ తీరు ఏపదవిలో ఉన్న దళితులే అన్న దోరణి ఇప్పటి వరకు కొనసాగుతుంది. పంచాయితీ కార్యదర్శి దళిత సర్పంచ్ కుర్చీలో కూర్చోవడాన్ని దళితులందరు తీవ్రంగా ఖండిస్తున్నారు. మండలంలోని కొలనూర్ గ్రామంలో శనివారం పంచాయితీ కార్యదర్శి సర్పంచ్ కుర్చిలో కూర్చోవడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. శనివారం గ్రామ పంచాయితీలో కార్పోరేషన్ లబ్దిదారుల ఎంపిక కోసం నిర్వహించిన సభలో పంచాయితీ కార్యదర్శి రమణారెడ్డి కొత్తగా ఎన్నికైనా దళిత మహిళ సర్పంచ్ అయిన తుమ్మల యమున స్థానంలో కూర్చొని […]

కోనరావుపేటః పల్లెల్లో మారనీ తీరు ఏపదవిలో ఉన్న దళితులే అన్న దోరణి ఇప్పటి వరకు కొనసాగుతుంది. పంచాయితీ కార్యదర్శి దళిత సర్పంచ్ కుర్చీలో కూర్చోవడాన్ని దళితులందరు తీవ్రంగా ఖండిస్తున్నారు. మండలంలోని కొలనూర్ గ్రామంలో శనివారం పంచాయితీ కార్యదర్శి సర్పంచ్ కుర్చిలో కూర్చోవడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. శనివారం గ్రామ పంచాయితీలో కార్పోరేషన్ లబ్దిదారుల ఎంపిక కోసం నిర్వహించిన సభలో పంచాయితీ కార్యదర్శి రమణారెడ్డి కొత్తగా ఎన్నికైనా దళిత మహిళ సర్పంచ్ అయిన తుమ్మల యమున స్థానంలో కూర్చొని సభ నిర్వహించారు. సర్పంచ్ మాత్రం మిగతా వార్డు సభ్యులు, ప్రజలతో కలిసి కూర్చుంది.

దీంతో సర్పంచ్ ఎం తోచక ఊరుకున్నదని గ్రామ ప్రజలు వాపోయారు. మండలంలో పెద్ద గ్రామ పంచాయితీలలో ఒక్కటైనా కొలనూర్ వంటి గ్రామంలో మహిళ మరియు దళిత సర్పంచ్‌ను ఇంత చిన్న చూపు చూడడం సరైంది కాదని ఇప్పటికైనా ఇలాంటి పద్దతి ఉన్న అధికారులు మారాలని సమాజంలో అందరిని ఒకేలా చూడాలని దళిత సంఘాలు కోరుతున్నాయి. సర్పంచ్ పదవికి కులాలు, మతాలు ఉండవు. గ్రామంలో సర్పంచ్ తండ్రి పాత్ర వహిస్తారు. దళితులు అయినప్పటికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం అవకాశం వచ్చింది. పదవులను గౌరవించండి. మహిళలకు గౌరవం ఇవ్వాలి. మనిషిగా చూడడం నేర్చుకుందాం.

Panchayat Secretary Sitting On Sarpanch Chair in Siricilla

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: