ఆదమరిస్తే అంతే సంగతులు…

నెక్కొండ ః రైతులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం తాము పండించే పంటకు నీటిని అందించడానికి అవసరమయ్యే వ్యవవసాయ బావులను రోడ్లకు ఆనుకుని తవ్వడం ద్వారా అటు వైపుగా ప్రయాణించే ప్రయాణికులు కొంత ఆదమరిచిన లేదా వాహనాలు అదుపు తప్పిన ఆ స్థలాల్లో పెను ప్రమాదమే సంబవించే ప్రమాదముంది. నెక్కొండ మండలంలో ప్రధానంగా నెక్కొండ మండల కేంద్రం నుండి గుండ్రపల్లి వయా కేసముద్రం , మహబూబాబాద్ వెళ్ళే రహదారిలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అవతల ఉన్నటు […]

నెక్కొండ ః రైతులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం తాము పండించే పంటకు నీటిని అందించడానికి అవసరమయ్యే వ్యవవసాయ బావులను రోడ్లకు ఆనుకుని తవ్వడం ద్వారా అటు వైపుగా ప్రయాణించే ప్రయాణికులు కొంత ఆదమరిచిన లేదా వాహనాలు అదుపు తప్పిన ఆ స్థలాల్లో పెను ప్రమాదమే సంబవించే ప్రమాదముంది. నెక్కొండ మండలంలో ప్రధానంగా నెక్కొండ మండల కేంద్రం నుండి గుండ్రపల్లి వయా కేసముద్రం , మహబూబాబాద్ వెళ్ళే రహదారిలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అవతల ఉన్నటు వంటి ప్రమాదకర మూల మలుపును ఆనుకుని ఒక వ్యవసాయ బావి ఉంది. మండల కేంద్రం నుండి నెక్కొండ తండాకు వెళ్ళే దారిలోని మూలమలుపులోని వ్యవసాయ భావికి ఇరుప్రక్కల చెట్లు, ముళ్ళ కంచెలతో బావి కనిపించరుండా కప్పేయడంతో కొద్ది రోజుల క్రితం మోడల్ స్కూల్ లోని విద్యార్థులను చేరెవేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్‌టిసి బస్సు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్ళే క్రమంలో  బస్సు డ్రైవర్ చాకచక్యంతో పెను ప్రమాదం నుండి తప్పించాడు.

మండల కేంద్రం నుండి చంద్రుగోండ, బంజరుపల్లి, వెళ్ళే దారిలోను దారికి ఆనుకునే బావులు ఉండటంతో అటు వైపుగా వెళ్ళాలంటే ప్రయాణికులు , వాహనదారులు జంకుతున్నారు. ఆర్అం డ్ బి అధికారులు, సంబంధిత అదికారులు ఇట్టి విషయంపై త్వరగా స్పందించలేనట్లయితే ముందు రోజుల్లో జరిగే దురదృష్ణ సంఘటలనలను చవి చూడాల్సి వస్తుంది. కనుక వెంటనే స్పందించి , మూల మలుపుల్లోను, వ్యవసాయ బావుల వద్ద హెచ్చరికల బోర్డుల ఏర్పాటు చేయాలని వాహనదారులు కొరుతున్నారు.  వ్యవసాయ బావులు ఉన్న స్థలంలోని రోడ్డుపై సైడ్ బర్మ్‌లు, స్పీడ్ బేకర్లను ఏర్పాటు చేసినట్లైతే వాహనదారుని వాహనం అదుపు తప్పిన సైడ్ బర్మ్‌లను నిర్మించడం వలన అట్టి వాహనం వ్యవసాయం బావిలోనికి దూసుకెళ్ళాకుండా ఉంటుంది. ఆర్ అండ్ బి, ఉద్యోగ కార్మికులతో రోడ్లకు ఇరువైపుల ఉన్న చెట్లను , ముళ్ళ కంచెలను తోలగించి, బావి ఉన్నట్లు సులువుగా కనిపించేలా ఉంచినట్లయితే ప్రమాదాలను కొంత వరకు నివారించినట్లు అవుతుంది.

Dangerous Well beside of Nekkonda Road in Warangal dist

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: