మేడ్చల్‌లో పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

  మేడ్చల్: మంత్రిగా తన బాధ్యత మరింత పెరిగిందని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తానని కార్మిక, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సి.మల్లారెడ్డి అన్నారు. శనివారం మేడ్చల్ పట్టణంలో పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్టు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు అందించిన భారీ మెజార్టీతోనే తనకు మంత్రిగా అవకాశం వచ్చిందని అన్నారు. తాను ఎంపిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిని కలిసి మేడ్చల్‌లో పాస్‌పోర్టు కేంద్రం ఏర్పాటు […]

 

మేడ్చల్: మంత్రిగా తన బాధ్యత మరింత పెరిగిందని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తానని కార్మిక, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సి.మల్లారెడ్డి అన్నారు. శనివారం మేడ్చల్ పట్టణంలో పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్టు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు అందించిన భారీ మెజార్టీతోనే తనకు మంత్రిగా అవకాశం వచ్చిందని అన్నారు. తాను ఎంపిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిని కలిసి మేడ్చల్‌లో పాస్‌పోర్టు కేంద్రం ఏర్పాటు చేయాలని, రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిని మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు.

పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించగా.. గత కొద్ది రోజుల క్రితం మేడ్చల్‌లో పాస్‌పోర్టు ఏర్పాటు చేసేందుకు భవనం కావాలని అధికారులు తెలపడంతో వెంటనే మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో భవనాన్ని పరిశీలించామన్నారు. పాస్‌పోర్టు అధికారులు కూడా అంగీకరించడంతో త్వరితగతిన భవనాన్ని సిద్దం చేసినట్లు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతానని.. అందులో భాగంగానే మేడ్చల్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నానని, మేడ్చల్‌ను సరికొత్త నగరంగా తీర్చిదిద్దుతానని మంత్రి మల్లారెడ్డి అన్నారు.

Minister Malla Reddy Starts Passport Office in Medchal

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: