బిజెపి సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి కన్నుమూత

  హైదరాబాద్: బిజెపి సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి కన్నుమూశారు. బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా చిన్నప్రేగు క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఈ నెల 10వ తేదీన కేర్ ఆస్పత్రిలో చేరాడు. బాల్ రెడ్డి మృతి చెందడంతో బిజెపి నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయతో పాటు భారీ సంఖ్యలో బిజెపి కార్యకర్తలు అస్పత్రికి చేరుకున్నారు. […]

 

హైదరాబాద్: బిజెపి సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి కన్నుమూశారు. బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా చిన్నప్రేగు క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఈ నెల 10వ తేదీన కేర్ ఆస్పత్రిలో చేరాడు. బాల్ రెడ్డి మృతి చెందడంతో బిజెపి నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయతో పాటు భారీ సంఖ్యలో బిజెపి కార్యకర్తలు అస్పత్రికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ బాల్ రెడ్డి మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

BJP Leader Baddam BalReddy Passed Away

Related Stories: