టిక్-టాక్ సరదా: విద్యార్థి మృతి

హైదరాబాద్: ఇప్పుడు సోషల్ మీడియాలో టిక్-టాక్ వీడియోల హవా నడుస్తున్నది. యువత రకరకాల వీడియోలను టిక్-టాక్ వీడియోలంటూ అప్‌లోడ్ చేయడం ఫ్యాషన్‌గా మారింది. అయితే అప్పుడప్పుడూ ఈ టిక్-టాక్ మోజు వికటించి దుష్పరిణామాలకు దారితీస్తున్నది. తాజాగా వీడియో కోసం చేసే కసరత్తు ఓ విద్యార్థి ప్రాణాలు బలిగొన్న సంఘటన తమిళనాడులో శుక్రవారం చోటు చేసుకుంది. వివకాలలోకి వెళితే స్థానికుల కథనం ప్రకారం.. తంజావూరులో సూర్య, రీగన్, విఘ్నేశ్ అనే ముగ్గురు విద్యార్థులు సైకిల్ మోటర్‌పై విన్యాసాలు చేస్తు టిక్-టాక్ […]

హైదరాబాద్: ఇప్పుడు సోషల్ మీడియాలో టిక్-టాక్ వీడియోల హవా నడుస్తున్నది. యువత రకరకాల వీడియోలను టిక్-టాక్ వీడియోలంటూ అప్‌లోడ్ చేయడం ఫ్యాషన్‌గా మారింది. అయితే అప్పుడప్పుడూ ఈ టిక్-టాక్ మోజు వికటించి దుష్పరిణామాలకు దారితీస్తున్నది. తాజాగా వీడియో కోసం చేసే కసరత్తు ఓ విద్యార్థి ప్రాణాలు బలిగొన్న సంఘటన తమిళనాడులో శుక్రవారం చోటు చేసుకుంది. వివకాలలోకి వెళితే స్థానికుల కథనం ప్రకారం.. తంజావూరులో సూర్య, రీగన్, విఘ్నేశ్ అనే ముగ్గురు విద్యార్థులు సైకిల్ మోటర్‌పై విన్యాసాలు చేస్తు టిక్-టాక్ వీడియో తీస్తున్నారు. వీడియో తీస్తూ నేరుగా వెళ్లి ఓ బస్సును ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు.  గాయపడ్డ వారిని స్థానికులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ విద్యార్థి మరణించాడు. ఇటీవలే తమిళనాడు అసెంబ్లీలో ఓ ఎంఎల్ఏ టిక్-టాక్ శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నదని ఆరోపించారు.

Student Dies In Road Accident in tamil nadu

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: