అఖిల భారత మ్యాజిక్ ఫెస్టివల్‌కు ఖమ్మం కళాకారులు

  మన తెలంగాణ/ఖమ్మం కల్చరల్: ఒడిస్సా రాష్ట్రంలోని పూరీలో ఈనెల 22 నుండి 24వరకు జరుగుతున్న అఖిల భారత మ్యాజిక్ ఫెస్టివల్‌కు ఖమ్మం నగరం నుండి ముగ్గురు కళాకారులకు అవకాశం లభించింది. వీరు ఖమ్మం నగరానికి చెందిన సీనియర్ మ్యాజిక్ కళాకారులు రామడుగు వసంత్‌కుమార్, కెవి, చారి, శ్రీరామ్‌లు ఉన్నారు. వీరు ఇప్పటికే రాష్ట్ర,జాతీయ స్తాయిలో సీనియర్ కళాకారులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒడిస్సాలోని కళింగ మ్యాజిక్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా వేలాదిమంది […]

 

మన తెలంగాణ/ఖమ్మం కల్చరల్: ఒడిస్సా రాష్ట్రంలోని పూరీలో ఈనెల 22 నుండి 24వరకు జరుగుతున్న అఖిల భారత మ్యాజిక్ ఫెస్టివల్‌కు ఖమ్మం నగరం నుండి ముగ్గురు కళాకారులకు అవకాశం లభించింది. వీరు ఖమ్మం నగరానికి చెందిన సీనియర్ మ్యాజిక్ కళాకారులు రామడుగు వసంత్‌కుమార్, కెవి, చారి, శ్రీరామ్‌లు ఉన్నారు. వీరు ఇప్పటికే రాష్ట్ర,జాతీయ స్తాయిలో సీనియర్ కళాకారులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒడిస్సాలోని కళింగ మ్యాజిక్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా వేలాదిమంది మ్యాజిక్ కళాకారులను ఈ ఫెస్టివల్‌కు ఆహ్వానించారు.

ఈ క్రమంలోనే ఖమ్మం నగరానికి చెందిన రామడుగు వసంత్‌కుమార్, కెవి చారి, శ్రీరామ్‌లకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానం లభించింది. ఈ మేరకు వీరు ముగ్గురు ఒక రోజు ముందే ఒడిస్సా వెళ్లి అక్కడ జరుగుతున్న ఆలిండియా మ్యాజిక్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. అఖిల భారత స్తాయి మ్యాజిక్ ఫెస్టివల్ నిర్వహించటం ఇది వరుసగా 5వ సారి కావటంతో దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి లబ్దప్రతిష్టులైన మ్యాజిక్ కళాకారులు వేలాదిగా తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల నుండి దాదాపు 50మందికి పైగా మ్యాజిక్ కళాకారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని వీరు ముగ్గురు చెపుతున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనటం జిల్లా వాసులుగా తమకు గర్వకారణమని చెప్పారు. మెజీషియన్‌లు ఇలాంటి మేజిక్ ఫెస్టివల్స్‌లో పాల్గొనటం ద్వారా దేశవిదేశాల నుండి వచ్చిన కళాకారులు చేసే మేజిక్ షోలను చూడటం, అదేవిదంగా కొన్ని రకాల షోలను నేర్చుకోవటం జరుగుతుందన్నారు. మెజీషియన్స్‌కు ఉపయోగపడే ఎన్నో స్టాల్స్‌ను కూడా ఇక్కడ ఏర్పాటుచేసారని చెప్పారు. జాతీయ అంతర్జాతీయ మెజీషియన్స్‌తో పరిచయాలు వంటివి కూడా లాభిస్తాయని పేర్కొన్నారు. 

కొత్త కొత్త అంశాలు నేర్చుకొవటానికి ఇలాంటి వేదికలు చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నారు. 23న అంతర్జాతీయ మెజీషియన్స్‌డేను కూడా నిర్వహించటం మ్యాజిక్ కళాకారులుగా తమకు సంతోషంగా ఉందన్నారు. పిసి సర్కార్ పుట్టిన రోజు వేడుకను భారతదేశం మొత్తం కూడా మెజీషియన్స్‌డేగా జరుపుకుంటున్నారని తెలిపారు. ఈ మూడు రోజుల మేజిక్ ఫెస్టివల్‌లో పాల్గొనటం తమకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఒడిస్సాలో జరుగుతున్న అఖిల భారత మ్యాజిక్ ఉత్సవానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వెళ్లిన ఈ ముగ్గుర్ని జిల్లా కళాకారులు అభినందించారు.

 

Khamma Artists Attended All India Magic Festival

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: