చెరుకు రైతులకు తీరని చిక్కులు

  కూలీలను సమకూర్చని కంపెనీలు కోతలు కరువై ఎండుతున్న తోటలు మన తెలంగాణ/పెద్దశంకరంపేట: చెరకు పంటకు ఒకప్పుడు ధాన్యాగారంగా పేరొందిన మెతుకు సీమ నేడు ఆ పరిస్థితిని కోల్పోయింది. ప్రతి సంవత్సరం అంతకంతకూ సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతోంది. మెదక్, సంగారెడ్డి, జిల్లాలోనే ఎక్కువగా ఈ పంటను సాగు చేస్తుంటారు. ఈ ప్రాంతంలోనే సంగారెడ్డి వద్ద గణపతి షుగర్స్, జహిరాబాద్ సమీపంలో ట్రైడెంట్ షుగర్, కల్హేర్ మండలానికి స మీపంలో జిల్లా సరిహాద్దులో మాగి వద్ద చక్కెర […]

 

కూలీలను సమకూర్చని కంపెనీలు

కోతలు కరువై ఎండుతున్న తోటలు

మన తెలంగాణ/పెద్దశంకరంపేట: చెరకు పంటకు ఒకప్పుడు ధాన్యాగారంగా పేరొందిన మెతుకు సీమ నేడు ఆ పరిస్థితిని కోల్పోయింది. ప్రతి సంవత్సరం అంతకంతకూ సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతోంది. మెదక్, సంగారెడ్డి, జిల్లాలోనే ఎక్కువగా ఈ పంటను సాగు చేస్తుంటారు. ఈ ప్రాంతంలోనే సంగారెడ్డి వద్ద గణపతి షుగర్స్, జహిరాబాద్ సమీపంలో ట్రైడెంట్ షుగర్, కల్హేర్ మండలానికి స మీపంలో జిల్లా సరిహాద్దులో మాగి వద్ద చక్కెర ప్యాక్టరీలు పని చేస్తున్నాయి. గతంలో మెదక్ మంబోజిపల్లి వద్ద నిజాం షుగర్స్ అధ్వర్యంలో ప్రభుత్వం చక్కెర ప్యాక్టరీని నడిపించింది. అయితే రాష్ట్రంలోని నిజాం షుగర్స్ అన్ని నష్టల్లో కూరుకుపోయినందు న వాటికి లాకౌట్ ప్రకటించారు. ప్రస్తుతం నడుస్తున్న ఫ్యాక్టరీలు అన్నీ కూడా ప్రైవేట్ వారి ఆధిపత్యంలోనే నడుస్తున్నాయి. నిజాం షుగర్స్ మూసివేతతోనే జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం పడిపోవడం ఆరంభమైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి కూడా చెరకు పండించిన రైతులకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నా నా తిప్పలు పడుతూ రైతులు పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. గతేడాది జనవరి నుంచి ఫిబ్రవరి చివరి వరకు పోలాల్లో కొత్తగా సాగు చేశారు.

ఎక్కువ మంది రైతులు పాత పంట కోయగా మిగిలిన చెరకు కణుపుల అధారంగా సాగు చేశారు. ఈ రెండు విధానాల్లో పంట డిసెంబర్ నుంచే కోతకు వచ్చింది. ఇప్పటి వరకు సగం చెరకును రైతులు అతికష్టం మీద కోశారు. మిగిలిన పంట కోతకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి లోని చక్కెర కర్మగారం యాజమాన్యం కోతలకు సరిపోను కూలీలను సమకూర్చడం లేదనే ఆరోపణలున్నాయి.

యంత్రం ఉన్నా కొన్ని పోలాల్లో కోతలకే పరిమితమవుతోంది. సంస్థ యాజమాన్యం పూర్తిగా కోసే పరిస్థితి లేదని తెలిసిన ప్రైవేటు గుత్తేదార్లు గుంపు కూలీలతో గ్రామాల్లో తిరుగుతున్నారు. రైతులను మభ్యపెట్టి కోతలకు ఇష్టానుసారం రుసుం వసూలు చేస్తున్నారనే పిర్యాదులు లేకపోలేదు. చెరకు కోత పూర్తయినా లారీలు రాకపోవడంతో గడల మోపులు రెండు, మూడు రోజులు పోలాల్లోనే ఉంచాల్సి వస్తోంది. దీంతో చె రకు బరువు తగ్గిపోయి రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదముంద ని పలువురు ఆవేదన చెందుతున్నారు.

మెదక్‌లో 1600 హెక్టార్లలో సాగు :
జిల్లాలో దాదాపు 1600 హెక్టార్లలో రైతులు చెరకును సాగు చేశారు. ఎకరం పోలంలో 40 నుంచి 50 టన్నుల చెరకు దిగుబడి వస్తుందని ఒక అంచనా. టన్ను చెరకు విక్రయిస్తే కంపెనీ యాజమాన్యం రూ. 2997 చెల్లించడానికి నిర్ణయించింది. ఇందులో కోత, రవాణా వంటి ఛార్జీలు పోనూ రైతులకు రూ. 2000 వరకు మిగులుతుంది. ఎకరం పోలం సాగు చేసిన రైతుకు రూ. 80 వేల నుంచి లష వరకు ఆదాయం వస్తుందని ఆశించారు. అయితే పరిశ్రమల యజమాన్యం ఒప్పందం ఉల్లఘించడం, ప్రైవేటు గుత్తేదారుల రంగప్రవేశంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. కంపెనీకి చెందిన కూలీలు చెరకు కోస్తే టన్నుకు రూ. 470, రవాణా చార్జీల కింద రూ. 450 రైతు చెల్లించాల్సి ఉంటుంది.

22 టన్నుల లోడ్‌తో వెళ్లే లారీ డ్రైవర్‌కు రూ. 1300 చొప్పున చెల్లిస్తున్నారని తెలిసింది. ఇలా మొత్తంగా లెక్కిస్తే ఒక లారీ చెరకు పరిశ్రమకు చేరాలంటే రూ. 21,540 వరకు రైతులు చెల్లించాల్సి వస్తోంది. దీనికి తోడు ప్రైవేట్ గుత్తేదారు ప్రతి టన్నుకు రూ. 600 వరకు చెల్లిస్తే తప్ప కోతలకు ఒప్పుకోవడం లేదు. ఇది కంపెనీ కూలీలకు చెల్లించే రూ. 470 తో పోల్చీ చూస్తే రూ. 130 అధికం. 22 టన్నులకు రూ. 2,860 అధికంగా చెల్లించాల్సి వస్తోంది. 100 టన్నుల చెరకు కోయాలంటే రైతులు రూ. 13,600 వరకు కోల్ఫోవలసి వస్తోందని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు.

కొత్తగా కత్తి కట్నం: రైతుల పోలాల్లో చెరకు కోతలకు వచ్చే కూలీలకు కత్తి కట్నం కింద ఎకరాకు రూ. 2000 వరకు తీసుకుంటున్నారు. కూలీల సంఖ్యను బట్టి విందు కోసం ఒక మేకపోతును కూడా ఇవ్వాలి. లేకుంటే కోతలకు కూలీలు అంగీకరించడం లేదు. ఎక్కువ విస్తీర్ణం లో చెరకు సాగు చేసిన రైతులు కత్తి కట్నం భారీగా సమర్పించాల్సి వస్తోంది. కూలీల సంఖ్యను అనుసరించి ఒకటి, రెండు మేక పోతులను ఇస్తున్నారు. ఆర్థికంగా లేని రైతులకు ఇది అదనపు భారంగా పరిణమిస్తోంది. చెరకు కోతలకు ధరల చెల్లింపుల విషయంలో అధికారులు, కంపెనీ యాజమాన్యం నియంత్రణ లేకపోవడంతో ఇలాంటి పరిస్థితులు నెలకోంటున్నాయని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది సాగు విషయంలో పునరాలోచనలో పడుతున్నట్లు తెలిసింది. అదే గనుక జరిగితే చెరకు సాగు ఇక భవిష్యత్తులో ప్రశ్నార్థకమే కానుందని చెప్పకతప్పదు.

Unhappy Problem to Sugarcane Farmers In Sangareddy

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: