లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయను : రజనీ

చెన్నయ్ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని దక్షిణాది  సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌  తేల్చి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే తాను పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.  అభిమాన సంఘాలు కానీ, ఇతర పార్టీలు కానీ ప్రచారం కోసం తన పేరును వాడుకోవద్దని ఆయన  హెచ్చరించారు. తమిళనాడు  నీటి […]

చెన్నయ్ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని దక్షిణాది  సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌  తేల్చి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే తాను పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.  అభిమాన సంఘాలు కానీ, ఇతర పార్టీలు కానీ ప్రచారం కోసం తన పేరును వాడుకోవద్దని ఆయన  హెచ్చరించారు. తమిళనాడు  నీటి సమస్యలు తీర్చే పార్టీకే ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. తాను పార్టీ పెట్టబోతున్నట్టు కొంతకాలం క్రితం రజనీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రెండు సార్లు ఆయన తన అభిమాన సంఘాలతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మళ్లీ రాజకీయ ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆయన ప్రకటించడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Rajinikanth Comments on Lok Sabha Elections

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: