స్థానికదనం

  జిల్లా, మండల పరిషత్‌ల ఎన్నికలకు మేలో నోటిఫికేషన్ మన తెలంగాణ/హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెం టనే జిల్లా, మండల పరిషత్ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కొత్తగా ఏర్పడిన మండలాలు, జిల్లాల ప్రకారం పునర్విభజన చేసి పంపాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మే నెలలో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తామని అందులో పేర్కొన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో జిల్లాలు, మండలాల పునర్విభజన జరిగినా, పాత […]

 

జిల్లా, మండల పరిషత్‌ల ఎన్నికలకు మేలో నోటిఫికేషన్

మన తెలంగాణ/హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెం టనే జిల్లా, మండల పరిషత్ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కొత్తగా ఏర్పడిన మండలాలు, జిల్లాల ప్రకారం పునర్విభజన చేసి పంపాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మే నెలలో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తామని అందులో పేర్కొన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో జిల్లాలు, మండలాల పునర్విభజన జరిగినా, పాత 9 జిల్లా పరిషత్‌లు, వాటి పరిధిలోని మండల పరిషత్‌ల కాలపరిమితి ముగియకపోవడంతో వాటి విభజన జరగలేదు. దీంతో 30 రెవెన్యూ జిల్లాలు (హైదరాబాద్ మినహాయిం చి), 535 గ్రామీణ మండలాల ప్రాతిపదికగా జెడ్‌పిలు, ఎంపిపిల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అందుకనుగుణంగా ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల నిర్వహణకు వీలుగా జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిల ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేయాలని కలెక్టర్లను పంచాయతీరాజ్ శాఖ ఆదేశించినట్లు తెలిసింది. ప్రతీ మండలంలోని ఓటర్లను ఒక్కొ ఎంపిటిసి కనీసం 3 వేల మంది ఓటర్లకు ప్రాతినిధ్యం వహించేలా పునర్విభజన చేయనుంది. కొత్త పంచాయతీరాజ్ చట్టానికి అనుగుణంగా ఈ ప్రతిపాదనలను ఈనెల 25 లోగా పూర్తి చేసి పంపాలని సూచించింది.

ఈ నెల 22వ తేదీన విడుదల చేయనున్న ఓటర్ల తుది జాబితాకనుగుణంగా జిల్లా, మండల ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు, వాటిలోని వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసి ప్రచురించేందుకు వీలుగా త్వరలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువరించనుంది. రెండు కొత్త జిల్లాలను, నాలుగు మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్లు విడుదల చేయడంతో వాటిని కూడా తుది జాబితాలో చేర్చనున్నారు. ఇదిలా ఉండగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల ఖరారును వచ్చే నెలాఖరులోగా పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. గ్రామ పంచాయతీలకు అమలు చేసినట్లు రెం డు పర్యాయాలు ఒకే రిజర్వేషన్ అమలయ్యేలా జడ్‌పి, ఎంపిపిల రిజర్వేషన్ల విధానం ఖరారు చేయనుంది.

Notification for District, Mandal Parishad elections in May

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: