మహిళలను వేధిస్తే జైలుకే

  షీటీమ్స్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ పలువురిపై కేసులు నమోదు మన తెలంగాణ/సిటీబ్యూరో: మహిళలు, యువతులతో అసభ్యంగా మాట్లాడినా, అసభ్య దృశ్యాలు సోషల్ మీడియాలో పెట్టినా, పంపించినా కటకటాలపాలవుతారు. నగరంలోని షీటీమ్స్ పోకిరీలపై దృష్టి సారించారు. మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారి భరతం పడుతున్నారు షీటీమ్స్. బాధితుల ఫిర్యాదు మేరకు పోకిరీలను అరెస్టు చేసి కొందరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపిస్తున్నారు. కొందరికి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. నగర షీటీమ్స్ శనివారం వివిధ […]

 

షీటీమ్స్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్
పలువురిపై కేసులు నమోదు

మన తెలంగాణ/సిటీబ్యూరో: మహిళలు, యువతులతో అసభ్యంగా మాట్లాడినా, అసభ్య దృశ్యాలు సోషల్ మీడియాలో పెట్టినా, పంపించినా కటకటాలపాలవుతారు. నగరంలోని షీటీమ్స్ పోకిరీలపై దృష్టి సారించారు. మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారి భరతం పడుతున్నారు షీటీమ్స్. బాధితుల ఫిర్యాదు మేరకు పోకిరీలను అరెస్టు చేసి కొందరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపిస్తున్నారు. కొందరికి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. నగర షీటీమ్స్ శనివారం వివిధ కేసుల్లో అరెస్టైన వారికి మనోజాగృతి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. నగర అడిషనల్ సిపి క్రైం శిఖాగోయల్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. యువకులు ప్రవర్తన మార్చుకోవాలని, భవిష్యత్‌లో యువతులను వేధించవద్దని, చదువుపై దృష్టి సారించాలని చెప్పారు.

నగర షీటీమ్స్ జనవరిలో ఐదు కేసులు నమోదు చేసింది, ఏడు పెట్టీ కేసులు, 47 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. నల్గొండకు చెందిన రూపవత్ వెంకటేష్ ఓ మహిళకు ఫోన్ చేస్తూ వేధించడమే కాకుండా, అసభ్య మెసేజ్‌లు పంపిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు షీటీమ్స్ పోలీసులు నిందితుడిని పట్టుకుని కోర్టు ముందు ప్రవేశపెట్టగా మూడు రోజుల జైలు శిక్ష విధించింది. ఫోన్‌లో మహిళను వేధిస్తున్న కేశవ్ కుమార్‌కు ఐదు రోజుల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించారు. ఫేస్‌బుక్, ఫోన్‌లో వేధిస్తున్న బొళ్ల అభిలాష్ కౌండినయ్యకు నాలుగు రోజుల జైలు శిక్షతోపాటు రూ.250 జరిమానాను కోర్టు విధించింది.

She Teams Counselling to Eve Teasers in Hyderabad

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: