కొలువుదీరిన 2 కొత్త జిల్లాలు

నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ 11 మండలాలతో నారాయణపేట నారాయణపేట జిల్లాలో మండలాలు: నారాయణపేట (26 గ్రామాలు), దామరగిద్ద (27 గ్రామాలు), మరికల్ (14 గ్రామాలు), కోసిగి (26 గ్రామాలు), ధన్వాడ (9 గ్రామాలు), నర్వా (20 గ్రామాలు), మద్దూర్ (30 గ్రామాలు), ఊట్కూర్ (27 గ్రామాలు), మక్తల్ (39 గ్రామాలు) , మాగనూర్ (20గ్రామాలు), కృష్ణా (14 గ్రామాలు). 9 మండలాలతో ములుగు ములుగు జిల్లాలో ఉండే తొమ్మిది మండలాలు: ములుగు […]

నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటు

ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

11 మండలాలతో నారాయణపేట
నారాయణపేట జిల్లాలో మండలాలు:
నారాయణపేట (26 గ్రామాలు), దామరగిద్ద (27 గ్రామాలు), మరికల్ (14 గ్రామాలు), కోసిగి (26 గ్రామాలు), ధన్వాడ (9 గ్రామాలు), నర్వా (20 గ్రామాలు), మద్దూర్ (30 గ్రామాలు), ఊట్కూర్ (27 గ్రామాలు), మక్తల్ (39 గ్రామాలు) , మాగనూర్ (20గ్రామాలు), కృష్ణా (14 గ్రామాలు).

9 మండలాలతో ములుగు
ములుగు జిల్లాలో ఉండే తొమ్మిది మండలాలు: ములుగు (19 గ్రామాలు), వెంకటాపూర్ (10 గ్రామాలు) , గోవిందరావు పేట (14 గ్రామాలు), మంగపేట (23 గ్రామాలు), వాజేడు (61) గ్రామాలు, తాడ్వాయి (సమ్మక్క సారక్క) (73 గ్రామాలు), ఏటూరు నాగారం (39 గ్రామాలు), కన్నాయిగూడెం (25 గ్రామాలు), వెంకటాపురం (72 గ్రామాలు).

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు కొత్త జిల్లాలు ఉనికిలోకి వచ్చాయి. నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ శనివారం గెజిట్ నోటిఫికేషన్ కోసం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు తెలంగాణలో 31 జిల్లాలు ఉండగా తాజాగా ములుగు, నారాయణపేట కొత్త జిల్లాలు కావడంతో మొత్తం సంఖ్య 33కు చేరుకుంది. రెండు జిల్లాల ఏర్పాటుకు సంబంధించి 2018 డిసెంబర్ 31 ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసిన ప్రభుత్వం వాటిపై ప్రజల నుంచి వివిధ సెక్షన్ల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించింది. వాటి ఆధారంగా 11 మండలాలతో నారాయణపేట జిల్లా, 9 మండలాలతో ములుగు జిల్లాలను ఏర్పాటు చేస్తూ శనివారం రెవెన్యూ శాఖ తుది నోటిఫికేషన్‌ను జారీచేసింది. ఫిబ్రవరి 17 (ఆదివారం) నుంచి ఈ కొత్త జిల్లాలు ఉనికిలోకి వస్తాయని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 17 ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినం కావడం విశేషం.
కలెక్టర్, ఎస్‌పిలకు పూర్తి అదనపు బాధ్యతలు :
కొత్తగా ఏర్పడిన రెండు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్‌పిలను ప్రభుత్వం తాత్కాలికంగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న రొనాల్డ్ రోస్‌కు నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించగా, అదే జిల్లా ఎస్‌పిగా ఉన్న రెమా రాజేశ్వరికి ఎస్‌పిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొనింది. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లకు ములుగు జిల్లా కలెక్టర్‌గా, భూపాలపల్లి ఎస్‌పిగా ఉన్న భాస్కరన్‌కు ములుగు జిల్లా ఎస్‌పిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
నారాయణపేట జిల్లాలోని మండలాలు, గ్రామాల వివరాలు:
పదకొండు మండలాలతో నారాయణపేట జిల్లా ఏర్పడింది. ఈ జిల్లాలో నారాయణపేట మండలం (26 గ్రామాలు), దామరగిద్ద (27 గ్రామాలు), మరికల్ (14 గ్రామాలు), కోసిగి (26 గ్రామాలు), ధన్వాడ (9 గ్రామాలు), నర్వా (20 గ్రామాలు), మద్దూర్ (30 గ్రామాలు), ఊట్కూర్ (27 గ్రామాలు), మక్తల్ (39 గ్రామాలు) , మాగనూర్ (20గ్రామాలు), కృష్ణా (14 గ్రామాలు) ఉంటాయి.
ములుగు జిల్లాలోని మండలాలు:
కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లాలో తొమ్మిది మండలాలు ఉంటున్నట్లు రెవిన్యూ శాఖ ఆ గెజిట్ ఉత్తర్వుల్లో పేర్కొనింది. ఈ జిల్లాలో ములుగు మండలం (19 గ్రామాలు), వెంకటాపూర్ (10 గ్రామాలు) , గోవిందరావు పేట (14 గ్రామాలు), మంగపేట (23 గ్రామాలు), వాజీడు (61) గ్రామాలు, తాడ్వాయి (సమ్మక్క సారక్క) (73 గ్రామాలు), ఏటూరు నాగారం (39 గ్రామాలు), కన్నాయిగూడెం (25 గ్రామాలు), వెంకటాపురం (72 గ్రామాలు) ఉంటాయని రాజేశ్వర్ తివారీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ రెండు కొత్త జిల్లాల ఏర్పాటుపై నారాయణపేట, ములుగు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ జిల్లాలను ఏర్పాటు చేసినందుకు సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Telangana Govt Create 2 New Districts

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: