ఐరాస సమ్మిట్‌లో ప్రసంగించనున్న ఎంపి కవిత

మన తెలంగాణ/హైదరాబాద్: నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితకు మరో అరుదైన గౌరవం లభించింది. యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్ స్థానిక సంస్థ, గ్లోబల్ నెట్‌వర్క్ ఇండియా మార్చి 1వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న లింగ సమానత్వ సమ్మిట్ (జిఇఎస్ 2019)లో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం అందింది. ఎంపి కవిత ఆలోచనలు, లింగ సమానత్వం కోసం చేస్తున్న ప్రయత్నాలు, ఎస్‌డిజి (స్థిరీకృత అభివృద్ధి) లక్ష్యాల సాధన కోసం చేస్తున్న ప్రయత్నాలను గుర్తించి సమ్మిట్‌కు ఆమెను ఎంపిక చేసింది. నాలుగవ పారిశ్రామిక […]

మన తెలంగాణ/హైదరాబాద్: నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితకు మరో అరుదైన గౌరవం లభించింది. యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్ స్థానిక సంస్థ, గ్లోబల్ నెట్‌వర్క్ ఇండియా మార్చి 1వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న లింగ సమానత్వ సమ్మిట్ (జిఇఎస్ 2019)లో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం అందింది. ఎంపి కవిత ఆలోచనలు, లింగ సమానత్వం కోసం చేస్తున్న ప్రయత్నాలు, ఎస్‌డిజి (స్థిరీకృత అభివృద్ధి) లక్ష్యాల సాధన కోసం చేస్తున్న ప్రయత్నాలను గుర్తించి సమ్మిట్‌కు ఆమెను ఎంపిక చేసింది. నాలుగవ పారిశ్రామిక విప్లవం, వ్యాపార, సాంకేతికత, ఆటోమేషన్, బిగ్ డాటా, పెరిగిన మానవడిజిటల్ ఇంటర్పేస్ పాత్ర పెరగడం, దీనివల్ల యువత ఆయా రంగాల్లో తగిన నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం, ఉపాధిపరంగా, నైపుణ్యం సముపార్జనలోనూ మహిళలు ఆయా రంగాల్లో పురోగమించేందుకు అవసరమైన నైపుణ్యాలు, సాంకేతికంగా పట్టు సాధించడం, పని ప్రదేశాల్లో అటువంటి వాతావరణాన్ని కల్పించడం, విద్యావిధాన మార్పులు వంటి పలు అంశాలపైనా సమ్మిట్‌లో ఎంపి కవిత తన ప్రసంగంలో సూచనలు చేయనున్నారు.

సమ్మిట్ నాలెడ్జ్ భాగస్వామి డెలాయిట్‌తో కలిసి నాలుగవ పారిశ్రామిక విప్లవం కోసం మహిళలను సిద్దం చేయడం, భారతదేశంలో లింగ సమానత్వం అవార్డులను ప్రదానం చేసే పద్దతులపైనా చర్చిస్తారు. ప్రభుత్వ అధికారులు, అకాడమీలు, పౌరసమాజ, ఎన్‌జిఒలు, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు, సిఎక్స్‌ఒ, సిహెచ్‌ఆర్‌ఒఎస్, ఛీఫ్ సస్టైనబిలిటీ ఆఫీసర్స్, పాలసీ మేకర్స్, సిఎస్‌ఆర్ మేనేజర్స్, ప్రాక్టీషనర్స్, కార్పోరేట్ కమ్యూనికేషన్ హెడ్‌లు జిఇఎస్‌లో బ్లూప్రింట్‌ను రూపొందిస్తారు. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కాంపాక్ట్ స్థానిక ఆర్క్, గ్లోబల్ కాంపాక నెట్‌వర్క్ ఇండియా(జిసిఎస్‌ఐ) మనదేశ వ్యాపారాలు, విద్యాసంస్థలు, పౌరసమాజ సంస్థలకు బాధ్యతాయుతమైన వ్యాపార విధానాలతో వాటిని బలోపేతం చేయడానికి కలిసికట్టుగా పనిచేసే ఒక వేదికగా వ్యవహరిస్తోంది. 2015లో రూపొందించబడిన మానవ హక్కులు, కార్మికులు, పర్యావరణం, అవినీతి రహిత సమాజ నిర్మాణం వంటి లక్ష్యాల కోసం ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు యత్నిస్తాయి. 193 సభ్య దేశాల్లో తీవ్ర పేదరికం, అసమానతలు, అన్యాయాన్ని ఎదుర్కోవడానికి భారతదేశంతో సహా ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు కలిసి పనిచేస్తున్నాయి.

MP Kavitha will Addressed in UN Summit

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: