పంచాయతీ కార్యదర్శుల కొరత

  సర్పంచ్‌లకు సమస్యగా మారిన సిబ్బంది కొరత ఒక్కో కార్యదర్శికి నాలుగు, ఐదు గ్రామాలు అప్పగింత మనతెలంగాణ/పెగడపల్లి : గ్రామ పంచాయతీల్లో గ్రామ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉండడంతో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు గాను 5 మంది కార్యదర్శులున్నారు. గ్రామ పంచాయతీలకు ఇన్‌చార్జ్‌లుగా నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం మండలంలో ఉన్న గ్రామాల్లో ఒక్కో పంచాయతీ కార్యదర్శి 5 పంచాయతీల్లో విధులు నిర్వహించాల్సి వస్తుంది. దీంతో గ్రామ పాలన ఇబ్బందికరంగా […]

 

సర్పంచ్‌లకు సమస్యగా మారిన సిబ్బంది కొరత
ఒక్కో కార్యదర్శికి నాలుగు, ఐదు గ్రామాలు అప్పగింత

మనతెలంగాణ/పెగడపల్లి : గ్రామ పంచాయతీల్లో గ్రామ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉండడంతో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు గాను 5 మంది కార్యదర్శులున్నారు. గ్రామ పంచాయతీలకు ఇన్‌చార్జ్‌లుగా నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం మండలంలో ఉన్న గ్రామాల్లో ఒక్కో పంచాయతీ కార్యదర్శి 5 పంచాయతీల్లో విధులు నిర్వహించాల్సి వస్తుంది. దీంతో గ్రామ పాలన ఇబ్బందికరంగా మారింది. ఇటీవలే నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం పంచాయతీల్లో పాలక వర్గాలు కొలువు దీరారు. కొత్త పాలక వర్గంలో సర్పంచ్‌లు గ్రామాల్లో ఏ పని చేపట్టాలన్నా తప్పనిసరిగా గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సక్రమంగా నిర్వహించడం వాటిని భద్రపరచడం తదితర పనులు కార్యదర్శి చేపట్టాల్సి ఉంటుంది. పంచాయతీ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీల్లో నెలకు కనీసం ఒక సమావేశం నిర్వహించాలని, ప్రతి రెండు నెలలకోసారి గ్రామ సభ నిర్వహించాల్సి ఉంటుంది.

ఈ పనులన్ని కార్యదర్శుల సమక్షంలో జరగాల్సినవే. వీటన్నింటికి ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు జనన మరణాలు వివరాలు, వివాహ రిజిస్ట్రేషన్లు నమోదు చేయా ల్సి ఉంటుంది. ఇటీవల కార్యదర్శుల కొరతవల్ల వివాహాల నమోదు ప్ర క్రియ జరగడం లేదు. దీంతో కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులు పలుసార్లు పంచాయతీ కార్యదర్శుల కోసం కార్యాలయాల చుట్టు తిరగాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. అదే విధంగా వితంతువుల, ఒంటరి మహిళల ఫించన్ కోసం మరణ ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా పంచాయతీ కార్యదర్శి రిజిష్టర్ చేయాల్సి ఉంటుంది. పంచాయతీల్లో కార్యదర్శులు సమయాల్లో అందుబాటులో లేక లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పదడం లేదు.

అభివృద్ధిపై ప్రభావం : గ్రామ పంచాయతీల్లో కార్యదర్శుల కొరత వల్ల గ్రామాభివృద్దిపై ప్రభావం పడుతోంది. ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామాలకు నిధులు సమకూర్చుతున్నప్పటికీ వాటిని సక్రమంగా జమ, ఖర్చులపై నమోదు చేసే క్రమంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో పాలనాపరంగా ఇబ్బందులు ఎదు రు అవుతున్నాయి. అలాగే గ్రామాల్లో కుటుంబాల వారిగా గణంకాలు ఉపాధి స్థితి, భూమి లేని కార్మికులు, హరితహారం, పారిశుద్దం, త్రాగునీటి సరఫరా తదితర కార్యక్రమాలను చూసేందుకు కార్యదర్శి పోస్టు కీలకమైంది. పంచాయతీ కార్యదర్శులతోపాటు ఇతర సిబ్బంది కొనత వేదిస్తుండడంతో గ్రామ పాలనపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నత అధికారులు వెంటనే స్పందించి గ్రామ పంచాయతీల్లో అవసరమైన సిబ్బందిని నియమించాలని ప్రజలు, సర్పంచ్‌లు కోరుతున్నారు.

గ్రామ పంచాయతీ కార్యదర్శులను నియమించాలి

ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక్కో కార్యదర్శిని నియమిస్తే ప్రభుత్వ పథకాల అమ లు, గ్రామ పాలనకు ఇబ్బందులుండవు. పంచాయతీల్లో సర్పంచ్ కీలకమే కానీ పరిపాలనా వ్యవహారాలు చక్కబెట్టడానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి తప్పనిసరి నూతన పాలకవర్గాలకు సూచనలు సలహాలు ఇచ్చేందుకు పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరి.

                                                                                                     – ఇనుగడ్ల కరుణాకర్‌రెడ్డి సర్పంచ్
Problems with Less Village panchayat Secretaries Officials

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: