సర్పంచ్ ఎన్నికపై అభ్యంతరాలుంటే న్యాయ పోరాటం చేయండి

కలెక్టర్ వెంకట్రామరెడ్డి మనతెలంగాణ/సిరిసిల్ల: సర్పంచ్ ఎన్నికపై ఎలాంటి అభ్యంతరాలున్నా న్యాయ పోరాటం సాగించాలని, ముస్తాబాద్ గ్రామంలో శాంతి యుత వాతావరణానికి సహకరించాలని ముస్తాబాద్ సర్పంచ్ అభ్యర్థులు, గ్రామ ప్రముఖులతో కలెక్టర్ వెంకట్రామరెడ్డి అన్నారు. ఇటీవల నిర్వహించిన ముస్తాబాద్ సర్పంచ్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, మళ్లీ ఎన్నికలు జరిపించాలని పరాజయం పాలైన సర్పంచ్ అభ్యర్థులు 20రోజులుగా ఆందోళన సాగిస్తున్నారు. గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్‌ను ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకుని ఆందోళన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ శనివారం […]
కలెక్టర్ వెంకట్రామరెడ్డి

మనతెలంగాణ/సిరిసిల్ల: సర్పంచ్ ఎన్నికపై ఎలాంటి అభ్యంతరాలున్నా న్యాయ పోరాటం సాగించాలని, ముస్తాబాద్ గ్రామంలో శాంతి యుత వాతావరణానికి సహకరించాలని ముస్తాబాద్ సర్పంచ్ అభ్యర్థులు, గ్రామ ప్రముఖులతో కలెక్టర్ వెంకట్రామరెడ్డి అన్నారు. ఇటీవల నిర్వహించిన ముస్తాబాద్ సర్పంచ్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, మళ్లీ ఎన్నికలు జరిపించాలని పరాజయం పాలైన సర్పంచ్ అభ్యర్థులు 20రోజులుగా ఆందోళన సాగిస్తున్నారు. గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్‌ను ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకుని ఆందోళన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ శనివారం సర్పంచ్ అభ్యర్థులతో కలెక్టరేట్‌లో మాట్లాడారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చూడాలన్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల అధికారి తుది ప్రకటన తరువాత తనకు పున:సమిక్షించే అధికారం లేదని అందువల్ల న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమ అభ్యంతరాలను తెలపాలన్నారు. గ్రామంలో శాంతియుత జీవనానికి భంగం కలుగకుండా సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెసి యాస్మిన్ బాష, ఆర్‌డిఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Complaint to Siricilla Collector on Sarpanch Elections

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: