కార్తీక్‌ను తప్పిచడం మంచిదికాదు..

  ముంబయి: ఆస్ట్రేలియాతో సొంత గడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్‌లో సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌ను పక్కన బెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతకాలంగా భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కార్తీక్‌ను ఆసీస్ వన్డే సిరీస్‌కు దూరంగా ఉంచడాన్ని అభిమానులు తప్పుపడుతున్నారు. వరుస అవకాశాలు కల్పించినా దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన లోకేశ్ రాహుల్‌ను ఎంపిక చేసి కార్తీక్‌ను పక్కన పెట్టడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. కార్తీక్ వంటి సీనియర్ ఆటగాడిపై సెలెక్టర్లు అనుసరించిన తీరుపై […]

 

ముంబయి: ఆస్ట్రేలియాతో సొంత గడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్‌లో సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌ను పక్కన బెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతకాలంగా భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కార్తీక్‌ను ఆసీస్ వన్డే సిరీస్‌కు దూరంగా ఉంచడాన్ని అభిమానులు తప్పుపడుతున్నారు. వరుస అవకాశాలు కల్పించినా దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన లోకేశ్ రాహుల్‌ను ఎంపిక చేసి కార్తీక్‌ను పక్కన పెట్టడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. కార్తీక్ వంటి సీనియర్ ఆటగాడిపై సెలెక్టర్లు అనుసరించిన తీరుపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. రాహుల్‌తో పోల్చితే కార్తీక్ చాలా కీలక ఆటగాడని, అతని సేవలు జట్టుకు ఎంతో అవసరమని అభిమానులు అంటున్నారు. రానున్న ప్రపంచకప్ నేపథ్యంలో సెలెక్టర్లు కార్తీక్‌ను పక్కన పెట్టడాన్ని అతని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. వరుసగా విఫలమవుతున్న రాహుల్ కంటే కార్తీక్ ఎంతో మెరుగైన ఆటగాడని వారంటున్నారు.

ఈ విషయం తెలిసి కూడా సెలెక్టర్లు కావాలనే కార్తీక్‌ను పక్కన బెట్టారని వారు విమర్శిస్తున్నారు. ఇటీవల భారత్ సాధిస్తున్న విజయాల్లో కార్తీక్ పాత్ర చాలా కీలకమన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. రాహుల్‌ను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారని వారు చీఫ్ సెలెక్టర్ ప్రసాద్‌ను ప్రశ్నించారు. అద్భుత ఫామ్‌లో ఉన్న కార్తీక్‌కు పక్కనబెట్టి ఫామ్‌లేమితో, వివాదాలతో సతమతమవుతున్న రాహుల్‌ను ఎంపిక చేయడాన్ని వారు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇదిలావుండగా హర్భజన్, సంజయ్ మంజ్రేకర్, గవాస్కర్, గంగూలీ తదితరులు కూడా సెలెక్టర్ల నిర్ణయాన్ని తప్పుపట్టారు. కార్తీక్ జట్టులో ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.

Dinesh Karthik Fans fire on BCCI Selection Committee

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: