జాతీయ చాంపియన్ సైనా

గౌహతి: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ టైటిల్ సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో రెండో సీడ్ సైనా 2118, 2115 తేడాతో టాప్ సీడ్ పి.వి.సింధును ఓడించింది. సైనా జాతీయ టైటిల్‌ను గెలుచుకోవడం ఇది వరుసగా రెండోసారి కావడం విశేషం. కిందటిసారి కూడా సింధును ఓడించి సైనా టైటిల్ గెలుచుకుంది. ఈసారి కూడా సైనా అదే సంప్రదాయాన్ని కొనసాగించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ప్రారంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. […]

గౌహతి: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ టైటిల్ సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో రెండో సీడ్ సైనా 2118, 2115 తేడాతో టాప్ సీడ్ పి.వి.సింధును ఓడించింది. సైనా జాతీయ టైటిల్‌ను గెలుచుకోవడం ఇది వరుసగా రెండోసారి కావడం విశేషం. కిందటిసారి కూడా సింధును ఓడించి సైనా టైటిల్ గెలుచుకుంది. ఈసారి కూడా సైనా అదే సంప్రదాయాన్ని కొనసాగించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ప్రారంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా తలపడ్డారు. దీంతో పోరు ఉత్కంఠంగా మారింది.

కీలక సమయంలో సైనా పైచేయి సాధించింది. సింధు ఫైనల్ ఫొబియా మరోసారి పునరావృతమైంది. ఒత్తిడిని తట్టుకోలేక వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న సైనా సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్ ప్రారంభంలో సింధు బాగానే ఆడింది. సైనాకు గట్టి పోటీ ఇస్తూ ముందుకు సాగింది. కానీ, కీలక సమయంలో సైనా కోలుకుంది. చూడచక్కని షాట్లతో ప్రత్యర్థిని హడలెత్తిస్తూ లక్షం దిశగా అడుగులు వేసింది. సింధు కూడా పట్టు సాధించేందుకు ప్రయత్నించింది. అయితే చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన సైనా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి విజేతగా అవతరించింది.

 Badminton National: Saina beats PV Sindhu in Final

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: