గ్రామాల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యం

  సర్పంచ్‌లు పారదర్శకంగా పరిపాలన సాగించాలి సర్పంచ్‌ల శిక్షణ తరగతులలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ మన తెలంగాణ/నాగర్‌కర్నూల్: గ్రామాల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యం సర్పంచ్‌లు పారదర్శకంగా పరిపాలన సాగించాలని సర్పంచ్‌ల శిక్షణ తరగతులలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ అన్నారు. నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను శనివారం ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి పం చాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]

 

సర్పంచ్‌లు పారదర్శకంగా పరిపాలన సాగించాలి
సర్పంచ్‌ల శిక్షణ తరగతులలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్: గ్రామాల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యం సర్పంచ్‌లు పారదర్శకంగా పరిపాలన సాగించాలని సర్పంచ్‌ల శిక్షణ తరగతులలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ అన్నారు. నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను శనివారం ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి పం చాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లను ఉద్ధేశించి ఆయన మాట్లాడుతూ సర్పంచ్‌లు కర్తవ్యాలు, విధులను బాధ్యతలను సక్రమం గా నిర్వహించాలని త మ తమ గ్రామాలలో అందరూ సభ్యలతో స మావేశం నిర్వహించి ముందుగా గ్రామానికి కావాల్సిన ప్రాధాన్యత పనులను, వాటని చే యాల్సిన అవసరాలను గుర్తించి ప్రణాళిక బద్దంగా రానున్న 5 సంవత్సరాలలో విభజన చేసుకొని ప్రతి గ్రామానికి నిధులను అంచన వేసుకొని కావాల్సిన పారిశుద్యం,సక్రమంగా నిర్వహించుట, వీధి దీపాలు, నర్సరీలు ఏర్పాటు చేసుకొని సంవత్సరానికి కనీసం 40 వేల మొక్కలు నాటడం మొక్కలను సంరక్షించే బాధ్యతను వాటికి కావాల్సిన సౌకర్యాలను కల్పించాలని అన్నారు.

ప్రతి నెల విధిగా సమావేశాలు నిర్వహించి గ్రామాభివృద్ధికి కావాల్సిన వసతులను సమకూర్చుకోవాలని అన్నారు. 5 సంవత్సరాలలో తమ తమ గ్రామాలలో ప్రా ధాన్యత అంశాలను విభజించుకొని గ్రామాభివృద్ధి పరుచుకునే బాధ్యత సర్పంచ్‌ల పై ఉంది అని అన్నారు. అందుకు ఇప్పటినుండే కష్టపడి గ్రామానికి కావాల్సిన అన్నిఅవసరాలు తీర్చే బాధ్యత సర్పంచ్‌లదే అని గుర్తు చేశారు. ప్రణాళిక బద్దంగా అభివృద్ధి పనులు చేయకుంటే గ్రామాలను అభివృద్ధి పరచడం లో పూర్తిగా విఫలమవుతారని అన్నారు. ఆదర్శ గ్రా మంగా పరిగనించేందుకు 6 ముఖ్యమైన అంశాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని అన్నారు. 1. గ్రామ ంలో పరిశుభ్రమైన పరిసరాలు పచ్చదనం , 2. ఇంటింటికి మరుగుదొడ్డి, 3. చెత్త ఇతర వ్యర్థ పదార్థాల ద్వారా ఎరువులు తయారి చేయటం, డంపింగ్ యా ర్డ్ ఏర్పాటు చేయడం, 4. తప్పనిసరిగా క్రిడామైదాన ం ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయాలకు అనుగుణంగా సాధిస్తూ ఆదర్శ గ్రామాలుగా తీ ర్చి దిద్దుకొని బంగారు తెలంగాణకు బాటలు వేయాలని అన్నారు. శిక్షణ తరగతులలో చీఫ్ ఎగ్జీక్యూటివ్ అధికారి టిఎస్‌ఐఆర్డి ఫౌస్మీబాసూ, జిల్లా కలెక్టర్ శ్రీ నివాస్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మో హన్, ఫిషరీస్ ఎడీ రజనీ తదితరులు పాల్గొన్నారు.

Chief Secretary Vikas Raj in Sarpanch training classes

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: