నష్టాల ఊబిలో గద్వాల ఆర్టీసీ డిపో

ఆదాయ మార్గాలను పట్టించుకోని అధికారులు మన తెలంగాణ / గద్వాల: అధికారుల అనాలోచిత నిర్ణయాలు ఆదాయ మార్గాలను విస్మరిస్తుండటంతో గద్వాల ఆర్టీసీ డిపో రూ.10కోట్ల నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతుంది. వందకుపైగా ఆర్టీసీ బస్సులు, 500 మంది సిబ్బంది, పదికిపైగా ప్రైవేటు బస్సులు ఉన్నప్పటికీ నష్టాల నుంచి బయటకు రాలేకపోతున్నది. అందరిని కలుపుకోకపోవడం, కేవలం కిలోమీటర్లు పెంచడం తప్ప ఆదాయంపై అధికారులు దృష్టి సారించకపోవడంతో నష్టాలు మరింత పెరుగుతూ ఆర్టీసీ డిపో ఉనికికే ముప్పుగా పరిగణిస్తుంది. గద్వాల డిపో […]
ఆదాయ మార్గాలను పట్టించుకోని అధికారులు

మన తెలంగాణ / గద్వాల: అధికారుల అనాలోచిత నిర్ణయాలు ఆదాయ మార్గాలను విస్మరిస్తుండటంతో గద్వాల ఆర్టీసీ డిపో రూ.10కోట్ల నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతుంది. వందకుపైగా ఆర్టీసీ బస్సులు, 500 మంది సిబ్బంది, పదికిపైగా ప్రైవేటు బస్సులు ఉన్నప్పటికీ నష్టాల నుంచి బయటకు రాలేకపోతున్నది. అందరిని కలుపుకోకపోవడం, కేవలం కిలోమీటర్లు పెంచడం తప్ప ఆదాయంపై అధికారులు దృష్టి సారించకపోవడంతో నష్టాలు మరింత పెరుగుతూ ఆర్టీసీ డిపో ఉనికికే ముప్పుగా పరిగణిస్తుంది. గద్వాల డిపో నుంచి దూర ప్రాంతాలతో పాటు గద్వాల, అలంపూర్ నియోజకవర్గంలోని పలు గ్రా మాలకు బస్సులను నడుపుతుంది. ముఖ్యంగా హైదరాబాద్, అయిజ, అయిజ వయా కర్నూల్ రూట్లను అధికారులు విస్మరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నా యి. దీంతో ఈ రూట్లలో ప్రైవేటు వాహనాలతో పాటు ఇతర డిపోలకు చెందిన వాహనాలు నడుపుతూ మన డి పోకు వచ్చే ఆదాయాన్ని కొల్లగొడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ రూట్లలో గజ్వేల్, యాదగిరిగుట్ట, జనగామ డిపోల బస్సులు విరివిరిగా తిరుగు తూ ఆదాయం ఆర్జిస్తుంటే మన గద్వాల డిపో నుంచి బస్సులు నడపకుండా నష్టాలు వచ్చే రూట్లలో బస్సులు న డుపుతూ డిపోకు మరింత నష్టాలను మూటగడుతున్నా రు. అదేవిధంగా ఎల్కూరు, మల్లెందొడ్డి గ్రామాలకు వ యా మల్దకల్ మీదుగా బస్సులను నడుపుతున్నప్పుడు మంచి ఆదాయం వచ్చేది. కానీ అధికారుల అనాలోచిత నిర్ణయాలతో పెద్దపల్లి నుంచి వాహనాలను నడుపుతుండటంతో గతంకంటే చాలా తక్కువ ఆర్జన వస్తూ ఆ రూట్లలో నష్టాల ఊబిలోకి వెళ్తున్నాయన్నది నగ్నసత్యం. ఈ విషయాలను ఉన్నతాధికారులకు వివరించినా సర్వీస్‌లను పెంచడంతో అసలుకే ఎసరు వస్తున్నది.

ఏ బస్సు ఎప్పుడొస్తుందో: ఏ బస్సు ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నా యి. బస్సుల కోసం విద్యార్థులు, ప్రజలు రోడ్లపైకి వచ్చిన పరిస్థితులు చూశాం. కానీ అధికారులలో మాత్రం మా ర్పు రాలేదు. బస్సుల సమయపాలన పాటించపోవడంతో ప్రయాణీకులు ప్రైవేటు వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు. ఇది కూడా ఆర్టీసీ డిపోకు నష్టం సంభవించడాని కి ఒక కారణంగా చెప్పవచ్చు.

కర్ణాటక బస్సులతో పోటీ పడలేక: గద్వాల డిపోకు రాయచూర్ – నుంచి గద్వాల మార్గం కూడా ఒక ఆదాయ వనరు. ఈ రూట్‌లో సీజన్‌లో ఒక్కొక్క బస్సు రూ.20వేలు తెచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అ లాంటి రూట్‌లో కర్ణాటక బస్సులతో మన బస్సులు పోటీ పడలేక ఆదాయాన్ని అప్పనంగా రాయచూర్ ఆర్టీసీకి ము ట్టజెపుతున్నారు. ఇదివరకు కర్ణాటక బస్సులు తక్కువగా తిరిగేవి. ఆదాయానికి అలవాటు పడటంతో కర్ణాటక ఆ ర్టీసీ బస్సులు ఏకంగా 8 బస్సులు నడుస్తున్నాయి. ఈ బ స్సులు వేగంగా వెళ్తూ గమ్యస్థానాలకు త్వరగా చేరుస్తుండటంతో ఎక్కువగా ప్రయాణీకులు కర్ణాటక బస్సులను ఆ శ్రయిస్తున్నారు. ఈ విషయం గురించి మన బస్సులకు స్పీడ్‌లాక్ గురించి అడిగితే ఎవరూ పట్టించుకోవడం లే దు. దీంతో ఆ రూట్‌లో కూడా నష్టాలు వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రూట్లలో సమయ వెలుసులుబాటు ఇ చ్చి కొంత మంచి బస్సులు నడిపితే ఆదాయాన్ని పెంచుకోవచ్చని పలువురు ప్రయాణీకులు అభిప్రాయపడుతున్నా రు. సూచనలు, సలహాలు సీనియర్లు ఇస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

డ్యూటీ హవర్స్ కోసం కిలోమీటర్లు పెంచుతున్నారు: సిబ్బంది డ్యూటీ హవర్స్ పెంచేందుకు అధికారులు అనాలోచిత నిర్ణయాలతో కిలోమీటర్లను పెం చుతుండటంతో నష్టాలు తప్పడం లేదు. గతంలో తక్కువ కిలోమీటర్లు తిరిగినా రూ.12వేల నుంచి రూ.13వేలు తీ సుకొచ్చేవారు. కానీ సిబ్బందికి డ్యూటీ హవర్స్ తగ్గుతుందని, ఇలా చేస్తే ఎలా అంటూ కిలోమీటర్లను పెంచారని పలువురు ఆరోపిస్తున్నారు. కిలోమీటర్లు పెరిగినా గతం కంటే ఆదాయం రావడం తగ్గిందే తప్ప ఒక్క రూపాయి కూడా పెరగలేదని సిబ్బంది వాపోతున్నారు. గంటనో, అ రగంటనో డ్యూటీ హవర్స్ తక్కువైనా ఆదాయం బాగానే తెస్తున్నప్పటికీ వీటిని పట్టించుకోకుండా కిలోమీటర్లు పెంచి నష్టాన్ని అధికారులే కొని తెచ్చుకుంటున్నారని ప లువురు అంటున్నారు. ఇలా ఉన్నతాధికారులు అనాలోచి త నిర్ణయాలతో డిపోకు నష్టాలను పెంచుతున్నారే తప్ప న ష్టాలను తగ్గించే ప్రయత్నాలు చేయడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పునరాలోచించుకొని వ్యవహరి స్తే నష్టాలను తగ్గించుకునే వీలవుతుంది.

నష్టాలు తగ్గించేందుకు కృషి చేస్తున్నాం: గద్వాల ఆర్టీసీ డిపో నష్టాల్లో ఉన్న మాట వాస్తవామే అని గద్వాల డిపో మేనేజర్ మురళీధర్ గౌడ్ తెలిపారు. కొన్ని రూట్లలో బస్సులను తిరగడంతో నష్టాలు వస్తున్నాయని, దా నిని తగ్గించేందుకు కృషి చేస్తున్నమని మనతెలంగాణ వివరించారు.

Gadwal RTC Depot in Serious Losses

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: