ప్రతి విద్యార్థికి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందిస్తాం

  విద్యార్థులను సాంకేతిక విద్యావంతులుగా తీర్చిదిద్దుతాం వనపర్తిలో డిజిటల్ కంప్యూటర్ శిక్షణకు శ్రీకారం 137 జడ్పిహెచ్‌ఎస్ పాఠశాలల్లో.. 12,139 మంది విద్యార్థులకు శిక్షణ కంప్యూటర్ శిక్షణ తరగతులు ప్రారంభించిన కలెక్టర్ శ్వేతామహంతి మన తెలంగాణ/వనపర్తి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను సాంకేతిక విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) సహకారంతో శ్రీకారం చుట్టి డిజిటల్ వనపర్తి కార్యక్రయన్ని శనివారం ప్రారంభించారు. టీటా సభ్యులు, వివిధ కంపెనీల్లోని 150 మంది టెకీల బృందం సభ్యుల యాత్రకు శుక్రవారం […]

 

విద్యార్థులను సాంకేతిక విద్యావంతులుగా తీర్చిదిద్దుతాం

వనపర్తిలో డిజిటల్ కంప్యూటర్ శిక్షణకు శ్రీకారం

137 జడ్పిహెచ్‌ఎస్ పాఠశాలల్లో.. 12,139 మంది విద్యార్థులకు శిక్షణ

కంప్యూటర్ శిక్షణ తరగతులు ప్రారంభించిన కలెక్టర్ శ్వేతామహంతి

మన తెలంగాణ/వనపర్తి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను సాంకేతిక విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) సహకారంతో శ్రీకారం చుట్టి డిజిటల్ వనపర్తి కార్యక్రయన్ని శనివారం ప్రారంభించారు. టీటా సభ్యులు, వివిధ కంపెనీల్లోని 150 మంది టెకీల బృందం సభ్యుల యాత్రకు శుక్రవారం సాయంత్రం హైద్రాబాద్ ఐటి శాఖా డైరెక్టర్ దిలీప్ కొణతం జెండా ఊపి ప్రారంభించారు. తొలి రోజు శిక్షణలో భాగంగా కంప్యూటర్ బేసిక్స్ నుండి కీలక అంశాలపై అవగాహన కల్పించా రు. టీటా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాత్రను కలెక్టర్ శ్వేతా మ హంతి ప్రశంసించారు. ఈనెల 16,17 తేదీల్లో వివిధ విషయాలపై నైపుణ్య శిక్షణ అందించేందుకు 137 పాఠశాలల్లో ని 12,139 మంది వి ద్యార్థులకు డిజిటల్ టిటరసీ కల్పించేందుకు రెండు రోజులు కెటాయించింది. కలెక్టర్ శ్వేతా మహంతి ఈ కార్యక్రమాలకు ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారం అందించడంతో తొలిరోజు విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.

శనివారం ఉదయం నుండి కలెక్టర్ శ్వేతామహంతి వివిధ పాఠశాలల్లో డిజిటల్ తరగతులను పర్యవేక్షించారు. ముందుగా ఆమె పాన్‌గల్ లోని జడ్పిహెచ్‌ఎస్ పాఠశాల, వీపనగండ్లలోని జడ్పిహెచ్‌ఎస్ పాఠశాల ,చిన్నంబావి మండలంలోని దగడపల్లి లో జడ్పి హెచ్‌ఎస్ పాఠశాలలో శిక్షణ పొందుతున్న శిక్షకులతో , విద్యార్థులతో ఆమె మాట్లాడారు. విద్యార్థులకు కంప్యూటర్‌లో కనీస నైపుణ్యాలను ,మెయిల్ క్రియేషన్స్, మెయిల్స్ ఫార్వర్డ్, షేర్ చేయడం, గూగుల్ సెర్చ్, రిసీవ్ చేసుకోవడం, నెట్‌వర్క్ నేర్పించాలని శిక్షకులను కోరారు. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, శిక్షకుల వివరాలను ఆమె తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులను కంప్యూటర్‌విద్యపై ప్రశ్నించారు. కలెక్టర్ వెంట డిఇఒ సుశీందర్‌రావు, టీటా అధికారులు, డిపిఆర్‌ఒ వెంకటేశ్వర్లు, ఎంఇఒలు ,హెచ్‌ఎంలు, ఉపా ధ్యాయులు ఉన్నారు.

Sweta Mohanty launched computer training classes

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: