రియల్ హీరో అనిపించుకున్నారు

గతంలో కేరళ వరద బాధితుల కోసం ముందుగా విరాళం ప్రకటించి ఆదర్శంగా నిలిచిన యంగ్‌స్టార్ విజయ్ దేవరకొండ తాజాగా మళ్లీ వార్తలో నిలిచారు. పుల్వామాలో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో అమరులైన వీర జవాన్ల కుటుంబాలకు అందరూ సంతాపం తెలుపుతుంటే విజయ్ ఒక్కడే ఆర్థిక సహాయాన్ని అందించడం సంచలనంగా మారింది. ఈ విషయంలో విజయ్ దేవరకొండ రియల్ హీరో అనిపించుకున్నారని నెటిజన్లు సోషల్ మీడియాలో అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి […]

గతంలో కేరళ వరద బాధితుల కోసం ముందుగా విరాళం ప్రకటించి ఆదర్శంగా నిలిచిన యంగ్‌స్టార్ విజయ్ దేవరకొండ తాజాగా మళ్లీ వార్తలో నిలిచారు. పుల్వామాలో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో అమరులైన వీర జవాన్ల కుటుంబాలకు అందరూ సంతాపం తెలుపుతుంటే విజయ్ ఒక్కడే ఆర్థిక సహాయాన్ని అందించడం సంచలనంగా మారింది. ఈ విషయంలో విజయ్ దేవరకొండ రియల్ హీరో అనిపించుకున్నారని నెటిజన్లు సోషల్ మీడియాలో అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన విజయ్ దేవరకొండ అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు టాలీవుడ్‌లో యంగ్ స్టార్‌గా దూసుకుపోతున్నారు.

ఎంత ఎదిగినా తన మూలాలను మరచిపోని తత్వం అతన్ని అందరికంటే భిన్నంగా ఆలోచించేలా చేస్తోందని పలువురు ప్రశంసిస్తున్నారు. “వారు మన కుటుంబాలను రక్షిస్తున్నారు. ఈ కష్ట కాలంలో మనం వారి కుటుంబాలకు అండగా నిలవాలి. సైనికుల జీవితాలను సాయంతో వెలకట్టలేము. కానీ దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న వారికి మన వంతు సహకారం అందించాలి. అందుకే నా వంతు సాయం అందించాను” అంటూ ట్విట్టర్‌లో విజయ్ దేవరకొండ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

Vijay Devarakonda Donation to Pulwama Soldiers Families

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: