సంవత్సరానికి ఒక్క సినిమా అయినా చేస్తా

తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత తాప్సీకి పెద్దగా సక్సెస్‌లు రాకపోయినా అదృష్టం కొద్ది చాలా చిత్రాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కొంతకాలం తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో ఈ భామ బాలీవుడ్‌కు వెళ్లింది. బాలీవుడ్‌లో అడపాదడపా చిత్రాలు చేస్తూ వస్తోంది. స్టార్స్ సినిమాల్లో నటిస్తున్న కారణంగా తాప్సీకి అక్కడ మంచి గుర్తింపే దక్కింది. బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నా కూడా సౌత్ సినిమాలను మాత్రం వదలను అంటోంది ఈ భామ. తనకు సినీ కెరీర్‌ను ప్రసాదించిన సౌత్ […]

తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత తాప్సీకి పెద్దగా సక్సెస్‌లు రాకపోయినా అదృష్టం కొద్ది చాలా చిత్రాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కొంతకాలం తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో ఈ భామ బాలీవుడ్‌కు వెళ్లింది. బాలీవుడ్‌లో అడపాదడపా చిత్రాలు చేస్తూ వస్తోంది. స్టార్స్ సినిమాల్లో నటిస్తున్న కారణంగా తాప్సీకి అక్కడ మంచి గుర్తింపే దక్కింది.

బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నా కూడా సౌత్ సినిమాలను మాత్రం వదలను అంటోంది ఈ భామ. తనకు సినీ కెరీర్‌ను ప్రసాదించిన సౌత్ సినీ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా తనకు ముఖ్యమేనని చెబుతోంది. సౌత్‌లో మంచి ఆఫర్స్ వస్తే తప్పకుండా నటిస్తానని తాప్సీ పేర్కొంది. తాజాగా ఆమె ‘గేమ్ ఓవర్’ అనే ద్విభాషా చిత్రంలో నటించింది. ఆ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీల్‌చైర్‌కు పరిమితమైన పాత్రలో తాప్సీ కనిపించనున్నట్లుగా సినిమా ఫస్ట్‌లుక్ చూస్తే అర్థమైంది. ఇక సౌత్ సినిమాలను వదిలి పెట్టకుండా సంవత్సరానికి ఒక్క సినిమా అయినా చేయాలనుకుంటున్నట్లు తాప్సీ పేర్కొంది.

Taapsee Pannu interested in South Film Industry

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: