బన్నీకి జోడీగా పూజ

‘నా పేరు సూర్య’ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది. ఈ చిత్రం త్రివిక్రమ్ స్టైల్‌లోనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సాగుతుందని… అల్లు అర్జున్ ఎనర్జీకి సరిపోయే విధంగా స్క్రిప్ట్‌ను పకడ్బందీగా తయారు చేస్తున్నారని తెలిసింది. ఇదిలాఉండగా ఈ సినిమాలో బన్నీ సరసన నటించబోయే హీరోయిన్ […]

‘నా పేరు సూర్య’ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది. ఈ చిత్రం త్రివిక్రమ్ స్టైల్‌లోనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సాగుతుందని… అల్లు అర్జున్ ఎనర్జీకి సరిపోయే విధంగా స్క్రిప్ట్‌ను పకడ్బందీగా తయారు చేస్తున్నారని తెలిసింది. ఇదిలాఉండగా ఈ సినిమాలో బన్నీ సరసన నటించబోయే హీరోయిన్ విషయంలో ఇప్పటికే చాలా రుమర్లు ప్రచారంలో ఉన్నాయి. కియారా అద్వానీ దాదాపు ఫైనల్ అయిందని వార్తలు కూడా వినిపించాయి. సాయి పల్లవి, కీర్తి సురేష్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారని కూడా అన్నారు.

కానీ ఈ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్ ఛాన్స్ పూజా హెగ్డేకు దక్కిందని తెలిసింది. అల్లు అర్జున్‌తో కలిసి పూజా హెగ్డే ‘డీజే’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఇద్దరి జోడీ బాగుండడమే కాకుండా పూజా గ్లామరస్‌గా కనిపించి ఆకట్టుకుంది. మరోవైపు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత..’లో ఎన్టీఆర్ సరసన ఆమె హీరోయిన్‌గా నటించింది. త్రివిక్రమ్‌కు తన సినిమాలలో హీరోయిన్లను పెద్దగా మార్చే అలవాటు లేదు. దీంతో బన్నీ సినిమాలో పూజను హీరోయిన్‌గా తీసుకుందామని ఆయన నిర్ణయించుకున్నారట. అల్లు అర్జున్ కూడా ఓకే అన్నారట. పూజాహెగ్డే ఇప్పటికే మహేష్‌బాబు చిత్రం ‘మహర్షి’, ప్రభాస్ 20వ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమాను మార్చి నెలాఖరున లేదా ఏప్రిల్ ప్రారంభంలో సెట్స్‌పైకి తీసుకెళ్తారట.

Pooja Hegde select in Allu Arjun next movie

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: