జవాన్ల కుటుంబాలకు అండగా అమితాబ్‌ బచ్చన్‌

  ముంబయి: పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన సిఆర్పిఎఫ్‌ జవాన్ల కుటుంబాలకు మెగాస్టార్ బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ అండగా నిలిచారు. జవాన్ల కుటుంబాలకు దాదాపు రూ.2.50 కోట్ల విరాళం ప్రకటించారు. అమరులైన ఒక్కో జవాను కుటుంబానికి అమితాబ్ రూ.5 లక్షలు సహాయం చేయబోతున్నారు. ఈ విషయాన్ని అమితాబ్‌ ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన జవాన్ల కుటుంబాలను అమితాబ్‌ నేరుగా కలవబోతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ్‌ దేవరకొండ, అనిల్‌ కపూర్ తదితరులు భారత్‌ కే వీర్‌ […]

 

ముంబయి: పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన సిఆర్పిఎఫ్‌ జవాన్ల కుటుంబాలకు మెగాస్టార్ బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ అండగా నిలిచారు. జవాన్ల కుటుంబాలకు దాదాపు రూ.2.50 కోట్ల విరాళం ప్రకటించారు. అమరులైన ఒక్కో జవాను కుటుంబానికి అమితాబ్ రూ.5 లక్షలు సహాయం చేయబోతున్నారు.

ఈ విషయాన్ని అమితాబ్‌ ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన జవాన్ల కుటుంబాలను అమితాబ్‌ నేరుగా కలవబోతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ్‌ దేవరకొండ, అనిల్‌ కపూర్ తదితరులు భారత్‌ కే వీర్‌ నిధికి విరాళాలు అందించి జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచారు.

 

Amitabh Bachchan Donation to Pulwama Soldiers Families

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: