‘రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదాన్ని రూపు మాపాలి’

      ఢిల్లీ: ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా సంపూర్ణ మద్దతు ఇస్తామని అన్ని పార్టీలు తెలిపాయని టిఆర్‌ఎస్ ఎంపి జితేందర్ రెడ్డి తెలిపారు. ఉగ్రదాడులు మళ్లీ ఎక్కడా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆల్‌పార్టీ మీటింగ్‌లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను టిఆర్‌ఎస్ ఎంపి జితేందర్ రెడ్డి కోరారు. పుల్వామా ఘోర ఘటనను సిఆర్‌పిఎఫ్ ఎడిజి అన్ని పార్టీలకు వివరించారని, ఇలాంటి ఘటనలతో ఉగ్రవాదులు భయాందోళనలు సృష్టించాలని చూస్తున్నారని, పుల్వామా ఘటనను […]

 

 

 

ఢిల్లీ: ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా సంపూర్ణ మద్దతు ఇస్తామని అన్ని పార్టీలు తెలిపాయని టిఆర్‌ఎస్ ఎంపి జితేందర్ రెడ్డి తెలిపారు. ఉగ్రదాడులు మళ్లీ ఎక్కడా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆల్‌పార్టీ మీటింగ్‌లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను టిఆర్‌ఎస్ ఎంపి జితేందర్ రెడ్డి కోరారు. పుల్వామా ఘోర ఘటనను సిఆర్‌పిఎఫ్ ఎడిజి అన్ని పార్టీలకు వివరించారని, ఇలాంటి ఘటనలతో ఉగ్రవాదులు భయాందోళనలు సృష్టించాలని చూస్తున్నారని, పుల్వామా ఘటనను సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు. ఉగ్రవాదాన్ని తొలగించాలని ముక్త కంఠంతో స్పష్టం చేశామని, పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదాన్ని రూపు మాపాలని జితేందర్ తెలిపారు. ప్రస్తుత ఘటనపై దర్యాప్తు జరుగుతుందని, ఉగ్రవాద ఏరివేతకు, జాతీయ సమైఖ్యతకు టిఆర్‌ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుదని పేర్కొన్నారు.

 

Terrorism Wash Out in India by Jitender Reddy

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: