బాన్స్‌వాడలో బిఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు…

నిజామాబాద్‌: బాన్స్‌వాడలో బిఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు గురువారం ప్రారంభమయ్యాయి. టిఆర్ఎస్ ఎంపి కవిత దత్తత గ్రామం అయిన కందకుర్తిలో బిఎస్‌ఎన్‌ఎల్‌ సెల్ టవర్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడారు. ప్రైవేటు పోటీని తట్టుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను టెలికాం అడ్వయిజరీ కమిటీ సమావేశంలో చర్చిస్తామని ఆమె పేర్కొన్నారు. బిఎస్ఎన్ఎల్ మన ఇంటి సంస్థ. సిఎం కెసిఆర్ బిఎస్ఎన్ఎల్ ను ప్రోత్సహించాలని అందరికీ చెప్తుంటారు. నిజామాబాద్ నగరంలో 58 వైఫై హాట్ స్పాట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. త్వరలో […]

నిజామాబాద్‌: బాన్స్‌వాడలో బిఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు గురువారం ప్రారంభమయ్యాయి. టిఆర్ఎస్ ఎంపి కవిత దత్తత గ్రామం అయిన కందకుర్తిలో బిఎస్‌ఎన్‌ఎల్‌ సెల్ టవర్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడారు. ప్రైవేటు పోటీని తట్టుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను టెలికాం అడ్వయిజరీ కమిటీ సమావేశంలో చర్చిస్తామని ఆమె పేర్కొన్నారు. బిఎస్ఎన్ఎల్ మన ఇంటి సంస్థ. సిఎం కెసిఆర్ బిఎస్ఎన్ఎల్ ను ప్రోత్సహించాలని అందరికీ చెప్తుంటారు.

నిజామాబాద్ నగరంలో 58 వైఫై హాట్ స్పాట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. త్వరలో అందుబాటులోకి రానున్న టి హబ్‌కు టెలికం సర్వీసులు అందించేందుకు టి హబ్‌ లో కార్యాలయాలు ఏర్పాటు చేసే సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఆదాయం పెంచుకోవచ్చిన కవిత వెల్లడించారు. అనంతరం జిల్లాలోని టెలికాం అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఎంపి కవిత పాల్గొన్నారు.

bsnl 4g services launch in banswada

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: