ఆధార్‌తో పాన్ లింక్ తప్పనిసరి

సుప్రీం కోర్టు ముంబై : ఆదాయం పన్ను రిటర్న్‌లకు ఆధార్‌తో పాన్(శాశ్వత ఖాతా సంఖ్య) అనుసంధానం తప్పనిసరిగా చేసుకోవాల్సిందేనని సుప్రీం కోర్టు పేర్కొంది. కోర్టు ఇంతకుముందు ఈ అంశపై నిర్ణయం చెప్పిందని, ఆదాయం పన్ను చట్టం సెక్షన్139ఎఎను సమర్థిస్తున్నామని న్యాయమూర్తులు ఎ.కె.సిక్రి, ఎస్.అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఆధార్‌పాన్ అనుసంధానం చేయకుండా 201819 సంవత్సరానికి ఆదాయం పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ శ్రేయ సేన్, జైశ్రీ సత్పుటె అనే ఇద్దరు […]

సుప్రీం కోర్టు

ముంబై : ఆదాయం పన్ను రిటర్న్‌లకు ఆధార్‌తో పాన్(శాశ్వత ఖాతా సంఖ్య) అనుసంధానం తప్పనిసరిగా చేసుకోవాల్సిందేనని సుప్రీం కోర్టు పేర్కొంది. కోర్టు ఇంతకుముందు ఈ అంశపై నిర్ణయం చెప్పిందని, ఆదాయం పన్ను చట్టం సెక్షన్139ఎఎను సమర్థిస్తున్నామని న్యాయమూర్తులు ఎ.కె.సిక్రి, ఎస్.అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఆధార్‌పాన్ అనుసంధానం చేయకుండా 201819 సంవత్సరానికి ఆదాయం పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ శ్రేయ సేన్, జైశ్రీ సత్పుటె అనే ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్‌కు ఢిల్లీ హైకోర్టు ఓకే చెప్పింది. దీంతో ఢిల్లీ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ కేంద్రం అప్పీలు చేయగా, తాజాగా సుప్రీం కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

ఆదాయం పన్ను రిటర్న్‌ల కోసం ఆధాతో పాన్ అనుసంధానం తప్పనిసరిగా చేసుకోవాల్సిందేనని సుప్రీం తీర్పునిచ్చింది. ఆధార్ అనుసంధానంపై గతేడాది సెప్టెంబరులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఆధార్ రాజ్యంగబద్ధమైనదేనని, అయితే అన్ని సేవలకు దాన్ని అనుసంధానం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మొబైల్ ఫోన్లు, బ్యాంకు ఖాతాలు, స్కూల్ అడ్మిషన్లు, టెలికాం కంపెనీలు తదితర వాటికి ఆధార్ తప్పనిసరి కాదని తెలిపింది. అయితే ఐటీ రిటర్నులు, పాన్ కార్డులకు మాత్రం ఆధార్ నంబరును అనుసంధానం చేయాల్సిందేనని కోర్టు తీర్పునిచ్చింది.

PAN link is mandatory with Aadhaar

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: