ఎంపి కవితకు కేరళ అసెంబ్లీ ఆహ్వనం

నిజామాబాద్: దేశంలోని విశ్వవిద్యాలయాల విద్యార్థులతో కేరళ అసెంబ్లీ నిర్వహిస్తున్న సదస్సులో ప్రసంగించాల్సిందిగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితను కేరళ అసెంబ్లీ స్పీకర్ పి. శ్రీరామకృష్ణన్ కొరారు. ఈ మేరకు ఆయన ఎంపి కవితను ఆహ్వనిస్తూ లేఖ రాశారు. కేరళ అసెంబ్లీ డైమెండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 23 నుండి 25వ తేది వరకు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సును ఉప రాష్ట్ర ముఖ్యమంత్రి వెంకయ్యనాయుడు 23న ప్రారంభించనున్నారు. అదే రోజు మద్యాహ్నం తిరువనంతపురంలోని కేరళ […]

నిజామాబాద్: దేశంలోని విశ్వవిద్యాలయాల విద్యార్థులతో కేరళ అసెంబ్లీ నిర్వహిస్తున్న సదస్సులో ప్రసంగించాల్సిందిగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితను కేరళ అసెంబ్లీ స్పీకర్ పి. శ్రీరామకృష్ణన్ కొరారు. ఈ మేరకు ఆయన ఎంపి కవితను ఆహ్వనిస్తూ లేఖ రాశారు. కేరళ అసెంబ్లీ డైమెండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 23 నుండి 25వ తేది వరకు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సును ఉప రాష్ట్ర ముఖ్యమంత్రి వెంకయ్యనాయుడు 23న ప్రారంభించనున్నారు. అదే రోజు మద్యాహ్నం తిరువనంతపురంలోని కేరళ అసెంబ్లీ కాంప్లెక్స్‌లో జరిగే సదస్సులో క్యాస్ట్ అండ్ ఇట్స్ డిస్కంటెట్స్ అనే అంశంపై ప్రసంగించాల్సిందిగా ఎంపి కవితను కేరళ స్పీకర్ కోరారు. కేరళ సిఎంతో పాటు దేశం నలుమూలల నుండి వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు కూడా సదస్సుకు హజరవుతారని, దేశవ్యాప్తంగా 2వేల మంది సామాజికంగా, రాజకీయంగా క్రీయాశీలకంగా ఉన్న జాతీయ విద్యార్థులు ఈ సదస్సుకు పాల్గొంటారని శ్రీరామకృష్ణన్ లేఖలో పేర్కొన్నారు.

కేరళ అసెంబ్లీ డైమాండ్ జూబ్లీ ఉత్సవాలను గత ఏడాది ఆగస్టులో రాష్ట్రపతి రాంనాథ కోవింద్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉత్సవాల్లో భాగంగా అనేక సెమినార్లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి సెమినార్‌ను గత ఏడాది ఆగస్టు 6-8 వరకు ఎస్సీ, ఎస్టీల సాధికారత సవాళ్లు అంశంపై సదస్సు జరిగింది. ఇప్పుడు రెండో సెమినార్‌ను ఈ నెల 23 నుండి 25వరకు జరగనుంది. ఇందులో యువతలో ప్రజాస్వామిక విలువలు, జీవన విధానం, ప్రజాస్వామిక ఆలోచన ధృక్పథాన్ని పెంపొందించే లక్షంతో సదస్సును నిర్వహిస్తున్నారు. కేరళ అసెంబ్లీ, ఆ రాష్ట్ర ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవహారాల శాఖలు సంయుక్తంగా ఎంఐటి వరల్డ్ పీస్ యూనివర్సిటి, పుణే సాంకేతిక సహకారంతో ప్రజాస్వామ్యంపై ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి.

Kerala Assembly Diamond Jubilee Celebration 2019

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: