భార్య కాపురానికి రాలేదని టవరెక్కిన భర్త

  మనతెలంగాణ/రామాయంపేట: భార్య కాపురానికి రాలేదని గతంలో ఓ భర్త విద్యుత్ స్తంభం ఎక్కి చేయి పోగొట్టుకోగా సోమవారం సెల్ టవర్ ఎక్కి భార్యను కాపురానికి రావాలంటూ మళ్లీ హల్ చల్ చేశాడు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన నందబోయిన శ్రీనివాస్‌కు గత కొంత కాలం క్రితం  ధర్మవ్వతో వివాహం జరిగింది. గత మూడు నెలల క్రితం ధర్మవ్వ భర్త శ్రీనివాస్‌ను వదిలి తల్లిగారింటికి వెళ్లింది. దీంతో భర్త శ్రీనివాస్ గ్రామంలో విద్యుత్ […]

 

మనతెలంగాణ/రామాయంపేట: భార్య కాపురానికి రాలేదని గతంలో ఓ భర్త విద్యుత్ స్తంభం ఎక్కి చేయి పోగొట్టుకోగా సోమవారం సెల్ టవర్ ఎక్కి భార్యను కాపురానికి రావాలంటూ మళ్లీ హల్ చల్ చేశాడు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన నందబోయిన శ్రీనివాస్‌కు గత కొంత కాలం క్రితం  ధర్మవ్వతో వివాహం జరిగింది. గత మూడు నెలల క్రితం ధర్మవ్వ భర్త శ్రీనివాస్‌ను వదిలి తల్లిగారింటికి వెళ్లింది. దీంతో భర్త శ్రీనివాస్ గ్రామంలో విద్యుత్ స్తంభం ఎక్కి నిరసన తెలుపగా గ్రామస్థులు అడ్డుకొని దిగాలని డిమాండ్ చేయగా ప్రమాదవశాత్తు దిగడంతో చేయికి తీవ్రగాయమైంది. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నాడు. రామాయంపేటలో ఉదయం సెల్‌టవర్ ఎక్కి మరోమారు తన భార్య కాపురానికి రావాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపాడు. కాగా సెల్‌టవర్ ఎక్కడంతో రామాయంపేట రహదారి పొడవున ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సెల్‌టవర్‌ ఎక్కిన నందబోయిన శ్రీనివాస్‌ను దిగాలని ప్రాదేయపడ్డారు. ససేమిరా అంటూ సుమారు రెండుగంటల పాటు హల్‌చల్ చేశాడు. చివరకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో సెల్‌టవర్‌ పైనుంచి శ్రీనివాస్ కిందకు దిగాడు.

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: