వామ్మో…గుండెనొప్పి

  యువతలో గుండెపోటు గుండెపోటుతో ప్రాణ హాని ఎక్కువే శారీరక శ్రమ, మానసిక ఒత్తిడే కారణం ముందస్తుగా గమనిస్తే ప్రాణాలు దక్కించుకోవచ్చు వైద్యులు డాక్టర్ గళ్ళా రఘు కిషోర్ ఇటీవల గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య క్రమేపీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. మద్యం, ధూమపానం, మానసిక ఒత్తిడికి ఎక్కువగా ఉన్నవారే గుండెనొప్పికి గురవుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి నిత్యం వ్యాయామం, ఆహార సూత్రాలను పాటించి గుండెను పదిలపరుచుకోవచ్చు. గుండెపోటుపై ‘మన తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం. మన తెలంగాణ/ఖమ్మం : […]

 

యువతలో గుండెపోటు
గుండెపోటుతో ప్రాణ హాని ఎక్కువే
శారీరక శ్రమ, మానసిక ఒత్తిడే కారణం
ముందస్తుగా గమనిస్తే ప్రాణాలు దక్కించుకోవచ్చు
వైద్యులు డాక్టర్ గళ్ళా రఘు కిషోర్

ఇటీవల గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య క్రమేపీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. మద్యం, ధూమపానం, మానసిక ఒత్తిడికి ఎక్కువగా ఉన్నవారే గుండెనొప్పికి గురవుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి నిత్యం వ్యాయామం, ఆహార సూత్రాలను పాటించి గుండెను పదిలపరుచుకోవచ్చు. గుండెపోటుపై ‘మన తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

మన తెలంగాణ/ఖమ్మం : ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మానసిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది. అందువల్ల ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్లు ఉండడం, ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగొచ్చు. ఇలాంటి వ్యక్తులకు అవసరాలను బట్టి బైపాస్ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ చేస్తారు. మళ్లీ బైపాస్ సర్జరీ చేయడం రోగికి ప్రమాదకరం. దీనికి ప్రత్యామ్నాయమే ఇఇసిపి.

లింగభేదం లేని గుండెపోటు
గుండె జబ్బుకు ఆడ, మగ భేదాలు లేవు. ఇప్పటి వరకూ మగవారికంటే ఆడవారికి గుండెపోటు ప్రమాదం తక్కువని ప్రచారంలో ఉంది. అయితే గుండెజబ్బు లక్షణాలకు లింగ భేదాలు ఉండవని వెల్లడైంది. గుండెపోటు కు గురయ్యే వారిలో చెయ్యి లాగేయడం, ఊపిరి అందకపోవడం, చమట పట్టడం, వికారంగా ఉండ డం వంటి లక్షణాలు స్త్రీపురుషులిద్దరిలోనూ కనపడతాయని తెలిసింది.పైగా, మహిళల్లో సాధారణంగా అందరిలో కనపడే గుండెపోటు లక్షణాలతోపాటు, గొంతు, దవడ, మెడలోనూ అసౌకర్యం క లుగుతుందని తేలింది. తమకు గుండెపోటు వచ్చే అవకాశం త క్కువని భావించడం వలన మహిళలు ఆ జబ్బుకు చికిత్స ఆలస్యం గా మొదలెడతారని, దాంతో ప్రమాదం మరింత పెరుగుతుంది.

ఇఇసిపి అంటే?
ఇఇసిపి అంటే (ఎన్‌హాన్స్‌డ్ ఎక్సర్నల్ కైంటర్ పల్షేషన్) అని అర్థం. మందులు, శస్త్ర చికిత్స లేకుండా గుండె జబ్బును నయం చేసే ప్రక్రియ ఇది. తద్వారా యాంజైనా నుంచి రోగికి విముక్తి కలుగుతుంది. చికిత్సలో భాగంగా రక్తపోటు పట్టీలను పీడనశక్తి ఉపయోగించి (కఫ్) కాళ్ల చుట్టూ కడతారు. గుండె కొట్టుకునే లయకు సమానంగా పీడనాన్ని విడుదల చేస్తారు. ఫలితంగా శరీరంలోని రక్తనాళాలన్నింటిలో రక్తసరఫరా అవుతుంది. ముఖ్యంగా గుండెలో. ఇఇపిపి ప్రక్రియలో భాగంగా మూసుకుపోయిన ధమనుల చుట్టున్న చిన్న రక్తనాళాలు (కొలటరల్స్) తెరుచుకుంటాయి. ఇవి రక్తప్రసరణను పెంచుతాయి. అంతేకాక గుండె కండరాలకి అందే రక్తప్రసరణను సాధారణ స్థితికి తీసుకొస్తాయి. తద్వారా గుండె పనిచేసే సామర్థ్యం పెరిగి గుండె నొప్పి (యంజైనా), ఆయాసం, దడ ఉండవు. అందుకే దీన్ని సహజ బైపాస్ అని అంటారు. ఈ చికిత్స ద్వారా గుండెలో చురుకుగా లేని రక్తనాళాలను కూడా తిరిగి సమర్థవంతంగా పనిచేయించొచ్చు. సహజంగా కొత్త రక్తనాళాలను ఏర్పరచొచ్చు. దీంతో గుండె కండరాలకు సమృద్ధిగా రక్తం అందుతుంది. ఒక్క మాటాలో చెప్పాలంటే గుండెకు పూర్తి స్థాయిలో రక్త సరఫరా చేయడం ఈ చికిత్స ముఖ్యఉద్దేశం.

నివారణ చర్యలు
1. గుండె జబ్బుల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తూనే ఉంటాం. నిజానికి గుండె జబ్బులు రాకుండా చూసుకోవడం మన చేతుల్లోనే ఉందని అంటున్నారు వైద్యులు.
2. ఉదయాన్నే వాకింగ్ వెళ్లాలంటే చాలా బద్దకం. నిజానికి నడక గుండెకు మంచిది. అందుకే రోజూ అరగంట పాటు నడవడం అలవాటు చేసుకోండి.
3. డైనింగ్ ఉప్పు డబ్బా లేకుండా చూసుకోండి. తినే సమయంలో అదనంగా ఉప్పు వేసుకునే అలవాటుకు స్వస్తి చెప్పండి. రోజులో ఒకటిన్నర స్పూన్(2400ఎం.జి) ఉప్పు మాత్రమే తీసుకోవాలి.
4. రోజూ ఐదు రకాల పండ్లు తినండి.
5. ఆల్కహాల్ అధిక మోతాదులో తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. ఆల్కహాల్ అలవాటు ఉంటే రెండు పెగ్గుల కంటే ఎక్కువగా తీసుకోకండి.
6. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మెట్లు ఎక్కండి. మీరు పైకి ఎక్కితే మీ రక్తపోటు తగ్గుతుంది.
7. పొగతాగే అలవాటు ఉంటే ఈ రోజే మానేయండి. రక్తనాళాలలో బ్లాక్స్ ఏర్పడే అవకాశాలను స్మోకింగ్ మరింత పెంచుతుంది.
8. కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.
9. లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్, బి.పి పరీక్షలను తరచుగా చెక్ చేయించుకోండి.
10. బరువును నియంత్రణలో ఉంచుకోండి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోండి.
11. ఏడాదికొకసారి కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోండి.
12. డయాబెటిస్ ఉంటే కనుక నియంత్రణలో ఉంచుకోండి. వ్యాయామం చేయడం మరవకండి. షుగర్ ఉన్న వారికి (ముఖ్యంగా మహిళలు) గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బులు దరిచేరకుండా ఉంటాయి.

సకాలంలో గుండెనొప్పిని గుర్తించాలి

చిన్న వయస్సులో చాతిలో నొప్పి వచ్చినప్పుడు దానిని గుండెపోటుగా గుర్తించడంలో జాప్యం వలన విలువైన సమ యం వృథా అయి గుండెపోటు ప్రాణాంతకంగా సంభవిస్తుందని కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రఘు కిషోర్ గళ్ళా అన్నారు. ఆయన ఆదివారం మన తెలంగాణ ప్రతినిధితో మాట్లాడారు. చాతిలో నొప్పి వచ్చినప్పుడు నిర్లక్షం చేయకుండా వైద్యులను సంప్రదించి ఈసీజీ వంటి చిన్న పరీక్ష చేయించుకోవడం ద్వారా 95 శాతం సందర్భాల్లో గుండెపోటును గుర్తించవచ్చన్నారు. సకాలంలో గుండెపోటును గుర్తించి సరైన చికిత్సను అందించగలిగితే విలువైన ప్రాణాలను దక్కించుకోవచ్చన్నారు. యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలన్నారు. ఆహారంలో జింక్ పుడ్స్, మాంసాహారాన్ని, నూనె పదార్థాలను, శీతల పానియాలను తక్కువగా తీసుకోవాలన్నారు.

తాజా కూరగాయలు, పండ్లను ఎక్కువగా తినాలన్నారు. వారానికి కనీసం 120 నిమిషాల పాటు వ్యాయమం తప్పనిసరిగా చే యాలన్నారు. బరువును, రక్తపోటును, మదుమేహాన్ని, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవాలన్నారు. దూమపానాన్ని, మద్యపానాన్ని దరిచేరనీయరాదన్నారు. గుండెపోటు లక్షణాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. గుండెపోటు లక్షణాలు వచ్చినప్పుడు ఎటువంటి నిర్లక్షం చేయకుండా వెంటనే గుండె వైద్యున్ని సంప్రదించి చికిత్స పొందటం ద్వారా ప్రాణాతకమైన ఈ వ్యాధి నుంచి మనల్ని రక్షించుకోవచ్చన్నారు.
– డా॥ గళ్ళా రఘు కిషోర్

Bypass surgery is dangerous to patient

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: